
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించాలి
మాక్లూర్: మండలంలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించే పనిలో ఉండాలని ఏసీపీ రాజావెంకట్‌రెడ్డి మాక్లూర్ ఎస్సై రాజశేఖర్‌కు సూచించారు. సోమవారం రాత్రి మాక్లూర్ పోలీస్‌స్టేషన్‌ను ఏసీపీ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తగిన భద్రత కల్పించాల్సిన అవసరం ఉంటుందన్నారు. అందుకు ఇప్పటి నుంచే పోలింగ్ సమయంలో ఏ గ్రామాలు సమస్యాత్మకంగా ఉంటాయనేది ఆరా తీయాలన్నారు. అలాంటి పోలింగ్ కేంద్రాల్లో కచ్చితంగా కట్టుదిట్టమైన బందోబస్తు చేపట్టాలని పేర్కొన్నారు. గ్రామ పోలీసులు ఇప్పటి నుంచే ఎన్నికల ప్రక్రియపై నిఘా ఉంచాలన్నారు. మారుతున్న పరిస్థితులను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు తెలియజేయాలన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఏసీపీ రాజావెంకట్‌రెడ్డి హెచ్చరించారు. ఆయన వెంట ననార్త్ జోన్ సీఐ శ్రీనివాస్, ఎస్సై–1 రాజశేఖర్, మొగులయ్య, పోలీసు సిబ్బంది ఉన్నారు.