
బాత్‌రూమ్‌లో జారిపడి మహిళా కండక్టర్ మృతి
క్రైం కార్నర్
బాన్సువాడ: ప్రమాదవశాత్తు బాత్‌రూమ్‌లో జారిపడి మహిళ కండక్టర్ మృతిచెందినట్లు సీఐ అశోక్ తెలిపారు. వివరాలు ఇలా.. పిట్లం మండలం కారేగాంకు చెందిన బేగరి సాయవ్వ(49) ఆర్టీసీలో కండక్టర్‌గా విధులు నిర్వహిస్తోంది. ఆమె భర్త కొన్నేళ్ల క్రితమే మృతిచెందగా, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కుమార్తెలకు పెళ్లిళ్లు అయిపోగా, కుమారుడితో కలిసి కొన్ని నెలలుగా బాన్సువాడ పట్టణంలోని సంగమేశ్వర కాలనీలో నివాసముంటుంది. శుక్రవారం రాత్రి బాత్‌రూమ్‌కు వెళ్లిన సాయవ్వ ప్రమాదవశాత్తు జారిపడిపోయింది. ఈ ఘటనలో తలకు తీవ్ర గాయం కావడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి, అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. మృతురాలి కుమారుడు బేగరి సాయిచరణ్‌తేజ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
చెరువులో పడి ఒకరు..
రాజంపేట: చెరువులో ప్రమాదవశాత్తు నీటమునిగి ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన రాజంపేట మండలం పొందూర్తి గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై రాజు, కుటంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా.. పొందూర్తి గ్రామానికి చెందిన తుడం భూపాల్ (38)కు వివాహం జరుగగా, కొన్నేళ్ల క్రితమే భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. పిల్లలు లేరు. దీంతో భూపాల్ మద్యానికి బానిసయ్యాడు. అప్పుడప్పుడు జంగంపల్లి చెరువులో చేపలు పడుతూ తిరిగేవాడు. తరచూ ఇంట్లో చెప్పకుండ వెళ్లిపోయి రెండు, మూడు రోజుల వరకుతిరిగివచ్చేవాడు కాదు. ఈక్రమంలో సెప్టెంబర్ 30న ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయాడు. శనివారం ఉదయం జంగంపల్లి చెరువులో ఓ వ్యక్తి మృతదేహం కనిపించగా, స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటన స్థలానికి చేరుకొని వివ రాలు సేకరించారు. మృతుడిని భూపాల్‌గా గుర్తించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. భూపాల్ కాళ్లకు వల చుట్టుకొని ఉండటంతో చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో పడి వల చుట్టు కోవడంతో మృతిచెందినట్లు పేర్కొన్నారు. మృతుడి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్సై తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి..
భిక్కనూరు: మండలంలోని బస్వాపూర్ గ్రామంలోని జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు భిక్కనూరు ఎస్సై అంజనేయులు శనివారం తెలిపారు. బస్వాపూర్‌లోని హైవేపై ఉన్న జైకా హోటల్ దగ్గర గుర్తుతెలియని వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్సై వివరించారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించామన్నారు.

బాత్‌రూమ్‌లో జారిపడి మహిళా కండక్టర్ మృతి

బాత్‌రూమ్‌లో జారిపడి మహిళా కండక్టర్ మృతి

బాత్‌రూమ్‌లో జారిపడి మహిళా కండక్టర్ మృతి