
మొగులు.. గుబులు
చేతికొచ్చిన పంటలు.. వాతావరణంలో మార్పులు
డొంకేశ్వర్‌లో వర్షానికి రంగుమారి దెబ్బతిన్న సోయా పంట
తొండాకూర్‌లో దిగుబడిని చూపుతున్న రైతు రాజన్న
డొంకేశ్వర్(ఆర్మూర్)/బోధన్ రూరల్: ఈ ఏడాది సోయాను సాగు చేసిన రైతులకు కాలం కలిసి రాలేదు. గత నెలలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు పంట దెబ్బతినడంతో దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది. ఖరీఫ్ సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా 33,603 ఎకరాల్లో సోయా సాగు చేశారు. ఏటా ప్రతికూల వాతావరణంతోపాటు మార్కెట్‌లో సరైన ధర లభించకపోవడంతో ఈ ఏడాది సోయా సాగును మరింత తగ్గించారు. ఆగస్టు మొదటి వారం వరకు పంట పరిస్థితి బాగానే ఉన్నా, ఆ తర్వాత పడిన భారీ వర్షాలు తీవ్రనష్టం కలిగించాయి. కోత దశకు చేరుకున్న సమయంలో వర్షాలు అడ్డంకిగా మారి చేనులోనే గింజలు రంగు మారాయి. పలు ప్రాంతాల్లో కుళ్లిపోయి పంట చేతికిరాకుండా పోయింది. ఇటీవల వర్షాలు తగ్గుముఖం పట్టడంతో పంట కోతలు చేస్తున్నారు. దిగుబడిని చూసి రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఎకరానికి సాధారణంగా 10–12 క్వింటాళ్ల దిగుబడి వచ్చేదని, వర్షాల కారణంగా ఐదారు క్వింటాళ్లు మాత్రమే వస్తోందని నిరాశ వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్‌లో క్వింటాలుకు రూ.3,200 వరకు ధర పలుకుతుండగా, పంట దిగుబడులు అమ్మితే ఎకరానికి రూ.25వేలు కూడా రావడం లేదంటున్నారు. పంట సాగు చేయడానికే ఎకరానికి రూ.25వేల వరకు పెట్టుబడి అవుతుందని, ఇప్పుడు ఆ పెట్టుబడి కూడా రాని పరిస్థితి నెలకొందని అంటున్నారు. మరోవైపు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరకే అమ్ముకోవాల్సి వస్తోందని రైతులు చెప్తున్నారు.
బోధన్ మండలంలోని హంగర్గ, కొప్పర్గ, ఖండ్‌గావ్, సిద్దాపూర్,కల్దుర్కి, మావందికాలన్, మా వందికుర్దు, రాంపూర్ గ్రామాల్లో సోయా పంటను అధికంగా సాగు చేశారు. ఇటీవల కురిసిన వర్షాలతో శ్రీరాంసాగర్ బ్యాక్ వాటర్, మంజీర నది వర ద ఉధృతిలో పంట నీటమునిగి దెబ్బతింది. మిగిలిన సోయా పంట కోతలు మెదలుపెట్టిన రైతులను ఆదివారం సాయంత్రం కురిసిన వర్షం ఇబ్బందుల పాలు చేసింది. ట్రాక్టర్‌లలో తరలిస్తుండగా వర్షం రావడంతో సోయాలు తడిసిపోయాయి.
సోయా... గయా!
నందిపేట్(ఆర్మూర్): ఖరీఫ్‌లో వ్యయప్రయాసలకోర్చి వరి సాగు చేసిన రైతులు కోతలకు శ్రీకారం చుట్టారు. పంట ఏపుగా పెరగడం, ఆరోగ్యంగా ఉండడంతో దిగుబడిపై భారీ ఆశలు పెట్టుకున్నారు. సాగునీరు అందుబాటులో ఉన్న ప్రాంత రైతులు సీజన్ ప్రారంభంలోనే వరి సాగు చేశారు. పంట చేతికందే దశలో వర్షాలు విరామం ఇవ్వడంతో వారం రోజుల నుంచి కోతలు ముమ్మరం చేశారు. అయితే, రెండ్రోజులుగా ఆకాశం మేఘావృతం అవుతుండడంతో రైతులు బెంబేలెత్తుతున్నారు. జిల్లాలో ఈ ఏడాది 4,36,695 ఎకరాల్లో వరి పంటను సాగు చేశారు. సుమారు 9.5 లక్షల పైచిలుకు మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. ఒకవైపు పౌర సరఫరాల శాఖ కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తూ ధాన్యం సేకరణకు సన్నద్ధమవుతోంది. మరోవైపు రైతులు హార్వెస్టర్లతో వేగంగా కోతలు చేపడుతున్నారు.
ఎస్సారెస్పీలోకి పుష్కలంగా నీరు..
ఈ ఏడాది ఖరీఫ్ ప్రారంభం నుంచి శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి పుష్కలంగా వరద నీరు రావడంతో వరి పంటకు నీటి సమస్య లేకుండా పోయింది. సా గు కోసం పెట్టిన పెట్టుబడులతోపాటు లాభాలు సై తం వస్తాయని ఎదురుచూస్తున్న తరుణంలో జిల్లా లో కురిసిన భారీ వర్షాలతో కొన్నిచోట్ల వరి పంట దెబ్బతిన్నది. రెండు రోజుల నుంచి అక్కడక్కడ వర్షాలు కురవడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. వర్షాలు కురిస్తే కోత మిషన్లు పొలంలోకి దిగే వీ లుండదు. దీంతో పనులు ఆగిపోయి తీవ్రంగా నష్ట పోతామంటున్నారు. మరోవైపు కోసిన తర్వాత వరి ధాన్యాన్ని ఆరబెట్టేందుకు భయపడుతున్నారు.
బాల్కొండ: మక్క రైతులకు ధరాఘాతం తప్పడం లేదు. ప్రభుత్వం మద్దతు ధర క్వింటాలుకు రూ.2400 ప్రకటించింది. అయితే సీజన్ ప్రారంభం నుంచి వర్షాలు వెంటాడతుండటంతో రైతులు ది క్కుతోచని స్థితిలో పడిపోయారు. మొదట్లో నూర్పి ళ్లు చేసి ఆరబెట్టిన మక్కలు వర్షార్పణం కావడంతో క్వింటాల్‌కు రూ.2200 కు విక్రయించారు. ప్రస్తు తం మళ్లీ తుపాన్ ఉందంటూ వాతావరణశాఖ హె చ్చరించడంతో వ్యాపారులు ధరను మరింత తగ్గించారు. క్వింటాల్‌కు రూ.2030 లకే కొనుగోలు చేస్తు న్నారు. తుపాన్ దడ రైతుల్లో ఉండటంతో వ్యాపారులు చెప్పిన ధరకే విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని పేర్కొంటున్నారు. ఎకరానికి రూ.9 వేల వరకు నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రెంజర్లలో ఆరబెట్టిన మక్కలు
వాతావరణ మార్పులు రైతుల్లో గుబులు పుట్టిస్తున్నాయి. జిల్లాలో అక్కడక్కడ కురుస్తున్న వర్షాలు నష్టాన్ని చేకూరుస్తున్నాయి. చేతికొచ్చిన పంటలు పొలాల్లో తడిసిముద్దవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలోని పలుచోట్ల కోతకు వచ్చిన సోయా పంట నీటమునిగి సగానికి సగం దిగుబడులు తగ్గాయి. మరోవైపు తుపాను హెచ్చరికలతో మక్కల ధరలు పడిపోయాయి. వరి కోతలపైనా వాన ప్రభావం చూపుతోంది. రెండ్రోజులుగా జిల్లాలో ఆకాశం మేఘావృతం అవుతుండడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
కలిసి రాని కాలం
ఆందోళన చెందుతున్న రైతన్నలు
పలుచోట్ల వర్షాలతో నష్టాలు
తగ్గుతున్న సోయా దిగుబడి
పడిపోయిన మక్క ధరలు
మొదలైన వరి కోతలు
పెట్టుబడి కూడా రాదు..
మూడెకరాల్లో సోయా పంటను సాగు చేశాను. ఎకరానికి రూ.25వేల చొప్పున పెట్టుబడి అయ్యింది. వర్షాలకు పంట దెబ్బతిని చేతికిరాకుండా పోయింది. గింజలు కుళ్లిపోయి ఎకరానికి ఐదారు క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చింది. పంట అమ్మితే పెట్టుబడి ఖర్చు కూడా రాదు.
– రాకేశ్, తొండాకూర్, డొంకేశ్వర్
రోజురోజుకూ తగ్గిస్తున్నారు..
మక్కల ధర రోజురోజుకూ తగ్గిస్తున్నారు. నిన్నటి వరకు క్వింటాల్‌కు రూ.2080 ఇచ్చి న వ్యాపారులు ఆదివారం రూ.2030కి తగ్గించారు. వ ర్షాల హెచ్చరికతో తక్కువ ధ రకై నా అమ్ముకుంటున్నాం. – రాజన్న, రైతు, రెంజర్ల

మొగులు.. గుబులు

మొగులు.. గుబులు

మొగులు.. గుబులు

మొగులు.. గుబులు

మొగులు.. గుబులు

మొగులు.. గుబులు

మొగులు.. గుబులు