భిక్కనూరు: తిప్పాపూర్‌లో కుంట రెడ్డి సంఘం ఆధ్వర్యంలో అలయ్‌బలయ్ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. దసరా ఉత్సవాల సందర్భంగా స్థానిక గ్రామదేవతల ఆలయాల ప్రాంగణంలో ఈ అలయ్‌బలయ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న కుంట రెడ్డి సంఘం సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం నుంచి సాయంత్రం వర కు మహిళలకు పలు పోటీలను నిర్వహించి ప్రతిభ చూపిన వారికి బహుమతులను అందజేశారు.
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మాల్తుమ్మెదలో శబరిమాత ఆశ్రమానికి సంబంధించి ఆదివారం 36వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం గీతాపారాయణం, ధ్వజారోహణ కార్యక్రమాలను చేపట్టారు. దీంతోపాటు శబరిమాత చిత్రపటాన్ని పల్లకిలో ఉంచి గ్రామంలోని ప్రధానవీధుల గుండా ఊరేగింపు నిర్వహిస్తూ పల్లకిసేవ చేశారు. రాత్రి వివిధ భజన మండళ్లతో భజన కార్యక్రమాలను జరిపారు.
కుంట రెడ్డి సంఘం ఆధ్వర్యంలో అలయ్‌బలయ్