
జిల్లాస్థాయి బాక్సింగ్ పోటీలు
నిర్మల్‌టౌన్: జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో సోమవారం జిల్లాస్థాయి అండర్–14 బా లురు, అండర్–17 బాల, బాలికలకు బాక్సింగ్ పో టీలను నిర్వహించారు. అండర్–17 బాలుర విభా గంలో ప్రవీణ్(46–48 కిలోలు), సౌర్యన్‌రెడ్డి(48– 50 కిలోలు ), శ్రీకాంత్(52–57 కిలోలు), అండర్–14 బాలురు విభాగంలో అవయుక్త(28–30 కిలోలు), ధ్రువ(42–44 కిలోల), అద్విత్(44–46 కిలోలు) రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. అండర్–17 బాలికల విభాగంలో హారిక(42 కిలోలు), సుహాసిని(42–44 కిలోలు), నిఖిత(44–46 కిలోలు), ఆర్.అక్షయ(46–48 కిలోలు), కీర్తన(48–50 కిలోలు), అభినయ(52–54 కిలోలు), శ్రావణి(63–66 కిలోలు), కవిత(66–70 కిలోలు) ఎంపికయ్యారు. వీరిని ఎస్జీఎఫ్ సెక్రెటరీ రవీందర్‌గౌడ్ అభినందించారు.