
ఆశ వర్కర్లకు కంటి పరీక్షలు
నిర్మల్‌చైన్‌గేట్: వరల్డ్ ఐ సైట్ డే పురస్కరించుకుని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా కంటి పరీక్ష శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా స్థానిక డిప్యూటీ డీఎంహెచ్‌వో ఆఫీస్‌లో మంగళవారం ఆశ కార్యకర్తలకు కంటి పరీక్షల శిబిరం ఏర్పా టు చేశారు. డీఎంహెచ్‌వో డాక్టర్ రాజేందర్ పరిశీలించారు. ప్రజలకు మెరుగైన నాణ్యమైన సేవలందించడానికి కృషి చేస్తున్న ఆశా కార్యకర్తల కంటి ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి ఈ కంటి స్కీన్రింగ్ పరీక్షలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. వైద్య విధాన పరిషత్ జిల్లా సూపరిండెంట్ డాక్టర్ సురేశ్, ఆప్తాల్మిక్ ఆఫీసర్ లక్ష్మీకాంత్, ఎల్వీ ప్రసాద్ కోఆర్డినేటర్ సాయన్న , ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.