
పారదర్శకంగా పత్తి కొనుగోళ్లు
కపాస్ కిసాన్ యాప్ ద్వారా పత్తి సాగు చేస్తున్న రైతులు దళారులపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు.
కనీస మద్దతు ధర ఈ సంవత్సరం ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.8110 గా నిర్ణయించింది. యాప్‌లో రిజిస్టర్ చేసుకుంటే కనీస మద్దతు ధర పొందవచ్చు.
అన్నదాతలకు పారదర్శకంగా సీసీఐ ద్వారా చెల్లింపులు జరుగుతాయి. రోజువారీ ధరలు, పంట తూకం, అమ్మకాల ఆధునిక సమాచారాన్ని ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు.
దేశ వ్యాప్తంగా పత్తి రైతుల వివరాలు సీసీఐ వద్ద నేరుగా రికార్డ్ అవుతాయి.
ఈ యాప్ ద్వారా పత్తి రైతులకు అమ్మకాల్లో సౌలభ్యం, మోసం లేకుండా, కనీస మద్దతు ధర లభించడం, మార్కెట్ సమాచారం లభిస్తుంది.
లక్ష్మణచాంద: తెల్లబంగారంగా పిలిచే పత్తి రైతు ఆరుగాలం శ్రమించిన మార్కెట్‌లో మాత్రం దళారుల చేతిలో చిత్తవుతున్నాడు. ఏటా పంట అమ్మే సమయంలో దళారుల చేతిలో మోసం తప్పడం లేదు. ఈ నేపథ్యంలో పత్తి రైతులను ఆదుకునేందుకు కేంద్రం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. గతంలో సరైన మద్దతు ధరలు లేకపోవడంతోపాటు దళారుల వ్యవస్థ కారణంగా నష్టపోయేవారు. దీనిని అరికట్టడానికి కేంద్రం ప్రత్యేక చర్యలు చేపడుతుంది. కొత్త యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది.
కపాస్ కిసాన్ యాప్..
కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆధ్వర్యంలో రూపొందించారు ఈ మొబైల్ యాప్, రైతులకు పత్తి దిగుమతి, అమ్మకాల ప్రక్రియలను సులభతరం చేయడంలో సహాయపడుతుంది. ఇది పారదర్శకతను పెంచి, కనీస మద్దతు ధర పొందాలనేది ఉద్దేశ్యం. ఆండ్రాయిడ్ మొబైల్ వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్‌లో ‘కపాస్ కిసాన్ యాప్‘ అని సర్చ్ చేసి, డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత, పేరు, ఆధార్ నంబర్, భూమి వివరాలు, పత్తి సంబంధిత రికార్డులు అప్‌లోడ్ చేయాలి. నమోదు చేసుకున్న రైతులు సీసీఐ కొనుగోలు కేంద్రాల ద్వారా పత్తి విక్రయించడానికి అవకాశం ఉంటుంది. వ్యాపారాన్ని ముందుగానే బుకింగ్ చేసుకునే సౌకర్యం కూడా ఉంది.
రైతులకు అవగాహన..
జిల్లాలో ఈ సారి 1.50 లక్షల ఎకరాలలో పత్తి పంట సాగు చేశారు. ఈ క్రమంలో కొత్త యాప్‌తో రైతులు ద్వారా ఎక్కువ ప్రయోజనం పొందుతారని వ్యవసాయ అధికారులు భావిస్తున్నారు. ఈ యాప్‌పై ఆదిలాబాద్, నిర్మల్ జిల్లా వ్యవసాధికారులకు సోమవారం అవగాహన కల్పించారు. ముందుగా విద్యావంతులైన రైతులకు అవగాహన కల్పించి వారి ద్వారా మిగిలిన రైతులకు అవగాహన కల్పించాలని అధికారులు భావిస్తున్నారు. మంగళవారం లక్ష్మణచాంద రైతు వేదికలో వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులకు ఈ యాప్‌పై అవగాహన కల్పించారు. ఈ యాప్ ద్వారా, రైతులకు మార్కెట్ లో తమ లావాదేవీలు పారదర్శకంగా, సులభంగా జరగనున్నాయి. రైతుల ఆదాయం పెరిగే దిశగా కేంద్రం తీసుకునే ఈ చర్యలు, గత నష్టాలపై పోరాటం చేస్తాయని భావిస్తున్నారు.
ప్రయోజనాలు ఇవే...