
వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత
● డీఎఫ్‌వో నాగిని భాను
నిర్మల్‌టౌన్: వన్యప్రాణులను సంరక్షించడం అందరి బాధ్యత అని, దీంతో పర్యావరణం సమతుల్యంగా ఉంటుందని జిల్లా అటవీశాఖ అధికారి నాగిని భాను అన్నారు. జిల్లా కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయంలో వన్యప్రాణి సప్తహ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక అటవీ శాఖ కార్యాలయం నుంచి పట్టణ ప్రధాన రహదారుల గుండా ర్యాలీ నిర్వహించారు. అటవీ జంతువుల సంరక్షణ చట్టాలపై అవగాహన కల్పించారు. వన్యప్రాణులను వేటాడడం చట్టరీత్యా నేరమని తెలిపారు. కార్యక్రమంలో నిర్మల్ ఎఫ్‌ఆర్‌వో రామకృష్ణ, అధికారులు అరుణ్‌కుమార్, నజీర్‌ఖాన్, సంతోష్, అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.