
డీఅడిక్షన్ సెంటర్ ప్రారంభం
నిర్మల్‌టౌన్: జిల్లాఏరియా ఆసుపత్రిలో డీఅడిక్షన్ సెంటర్‌ను డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ సెక్రెటరీ రాధిక మంగళవారం ప్రారంభించారు. సెంట ర్ సేవల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మద్యం, మత్తుపదార్థాలకు బానిసైనవారు సద్వినియోగం చేసుకోవాలని సూచించా రు. డాక్టర్ కిరణ్, డిప్యూటీ నర్సింగ్ సూపరింటెండెంట్ విజయలక్ష్మి పాల్గొన్నారు.
విద్యార్థులకు ఇబ్బందులు రానివ్వొద్దు
భైంసాటౌన్: పట్టణంలోని స్వామి వివేకానంద అనాథ పిల్లల ఆవాసాన్ని రాధిక మంగళవారం సందర్శించారు. పరిసరాలు, విద్యార్థుల గదులు, వంటగది, వసతులు పరిశీలించారు. విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు. ఆవాసం అధ్యక్షుడు శైలేశ్, ప్రముఖ్ లింగారెడ్డి ఉన్నారు.