
కరాటే బెల్ట్ గ్రేడింగ్ పరీక్షలు
నిర్మల్‌టౌన్: జపాన్ కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని జుమ్మేరాత్‌పేట్ హైస్కూల్లో సోమవారం కరాటే బెల్టు గ్రేడింగ్ పరీక్షలు నిర్వహించారు. ఈ గ్రేడింగ్ టెస్ట్‌లో జిల్లా నుంచి 11 మంది విద్యార్థులు నేషనల్ బ్లాక్‌బెల్ట్ (3వ సాదన్)కు అర్హులయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర చీఫ్ ఎగ్జామినర్ రాపోలు సుదర్శన్ అర్హులైన విద్యార్థులకు బెల్ట్‌లు, సర్టిఫికెట్లను అందజేశారు. కార్యక్రమంలో జపాన్ కరాటే అసోసియేషన్ జిల్లా చీఫ్ ఎగ్జామినర్ తేజందర్ సింగ్‌భాటియా, జిల్లా అధ్యక్షుడు కొండాజీ శ్రీకాంత్, టెక్నికల్ డైరెక్టర్ చందుల స్వామి, జిల్లా సెక్రెటరీ అమ్ముల భూషణ్, శిక్షకులు శ్రీకాంత్, కిరణ్, శేఖర్, చిరంజీవి, మనీషా, శివ, మేఘన, అమూల్య తదితరులు పాల్గొన్నారు.