
ఫుట్‌బాల్ చాంపియన్‌గా వనపర్తి
● రన్నరప్‌గా నిలిచిన కరీంనగర్
● సెమీస్‌లో పోరాడి ఓడిన మహబూబ్‌నగర్
● ట్రోఫీలు అందజేసిన ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లా కేంద్రంలో ముగిసిన రాష్ట్రస్థాయి సీనియర్ పురుషుల ఫుట్‌బాల్ పోటీల్లో విజేతగా వనపర్తి జిల్లా జట్టు నిలిచింది. ఆదివారం వర్షాల నేపథ్యంలో జడ్చర్ల పట్టణంలో నిర్వహించిన వనపర్తి, కరీంనగర్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ హోరాహోరీగా సాగింది. మ్యాచ్ ముగిసే సరికి ఇరు జట్లు గోల్స్ చేయకపోవడంతో టై బ్రేకర్ నిర్వహించారు. చివరకు వనపర్తి జట్టు 5–4 గోల్స్ తేడాతో కరీంనగర్ జట్టుపై విజయం సాధించి చాంపియన్‌షిప్‌ను కై వసం చేసుకుంది. మహబూబ్‌నగర్, గద్వాల జట్లు సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచాయి.
సెమీస్‌లో పోరాడి ఓడిన మహబూబ్‌నగర్
మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో వనపర్తి, మహబూబ్‌నగర్ జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. మ్యాచ్ ముగిసే సమయానికి రెండు జట్లు ఎలాంటి గోల్స్ చేయలేదు. దీంతో టై బ్రేకర్ నిర్వహించగా వనపర్తి జట్టు 4–2 గోల్స్ తేడాతో మహబూబ్‌నగర్ జట్టుపై గెలుపొందింది. రెండో సెమీఫైనల్‌లో కరీంనగర్ జట్టు 3– 2 గోల్స్ తేడాతో జోగులాంబ గద్వాల జట్టుపై విజయం సాధించింది.