
ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి
కొన్నేళ్లుగా పెంకుటిల్లులో జీవనం సాగిస్తున్నాం. మాకు ఇద్దరూ ఆడపిల్లలే. వృద్ధాప్యం వల్ల పని చేయడానికి నా భర్తకు చేతకావడం లేదు. పెద్ద కూతురికి గతంలోనే ఎలాగోలా పెళ్లి చేశాం. స్థానిక కూరగాయల మార్కెట్‌లో తోపుడుబండి పెట్టుకుని చిన్న చిన్న వస్తువులు అమ్ముకుని కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాం. ఇటీవలి భారీ వర్షాలకు ఇల్లు పైకప్పు నుంచి నీరు కారుతోంది. గోడ పెచ్చులు ఊడిపోతుండటంతో నెల రోజుల క్రితమే ఖాళీ చేశాం. అప్పటి నుంచి వీరన్నపేటలోని ఓ అద్దె ఇంట్లో ఉంటున్నాం. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలి.
– మడ్డె జానకమ్మ, హనుమాన్‌నగర్–న్యూగంజ్
పాత ఇల్లు పడిపోయింది
ఇటీవలి భారీ వర్షాలకు మేము నివసిస్తున్న పాత పెంకుటిల్లు కట్టెలు విరిగి పడిపోయింది. అప్పటి నుంచి సమీపంలోని మా బంధువుల ఇంట్లోనే తలదాచుకుంటున్నాం. నేను వ్యవసాయ కూలీగా, నా భర్త కావలి పెంటయ్య మున్సిపాలిటీలో కాంట్రాక్టు కార్మికుడిగా, కుమారుడు యాదయ్య సెంట్రింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాం. గతంలోనే అభయహస్తం పథకం కింద దరఖాస్తు చేయ డంతో నా పేరిట ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. ఇప్పుడు నిబంధనల ప్రకారమే కొత్తది నిర్మించుకుంటున్నాం. – కావలి చిన్న చెన్నమ్మ,
ఎస్సీకాలనీ, బోయపల్లి

ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి