
అర్ధరాత్రి పాలమూరులో భారీవర్షం
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: జిల్లా కేంద్రంలో ఆదివారం అర్ధరాత్రి దాటాక 2.30 గంటల నుంచి సోమవారం తెల్లవారుజామున 4.30 గంటల వరకు భారీ వర్షం కురిసింది. దీంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ముఖ్యంగా గచ్చిబౌలి, గోల్‌మసీదు, రాయచూర్ రోడ్డు, గణేష్‌నగర్, వల్లభ్‌నగర్, బీకేరెడ్డికాలనీ, నాగిరెడ్డి కాలనీ, బీఎన్‌రెడ్డికాలనీ, రామయ్యబౌలిలోని డ్రెయినేజీలన్నీ పొంగి పొర్లి రోడ్లపైకి వరదనీరు అడుగు మేర ప్రవహించింది. అలాగే కొత్త బస్టాండు ప్రాంగణంలోనూ వరదనీరు చేరింది. శ్రీనివాస కాలనీ వద్ద జాతీయ రహదారి–167పై నుంచి ఉద్ధృతంగా వరదనీరు ప్రవహించింది. ఈ క్రమంలో మెయిన్ రోడ్డుకు 5 అడుగులు కిందికి ఉన్న ఓ ఇంటిలోకి నీరుచేరడంతో.. పెద్ద శబ్దంతో కాంపౌండ్ వాల్ కూలిపోగా ఇంట్లోవారికి మెలకువ వచ్చింది. దీంతో వెంటనే ఇంట్లో ఉన్న నలుగురు మేడపైకి చేరుకోవడంతో త్రుటిలో ప్రమాదం తప్పింది. అలాగే మరో నాలుగు దుకాణాల్లోని సెల్లార్లలోకి రెండు అడుగుల మేర వరద నీరు చేరింది.
శ్రీనివాసకాలనీలో
కూలిపోయిన కాంపౌండ్ వాల్
ఓ ఇంటి ఆవరణలోకి
చేరిన వరదనీరు

అర్ధరాత్రి పాలమూరులో భారీవర్షం