
ఛాతిలో నొప్పి వస్తే జాగ్రత్త
ఆకస్మాత్తుగా ఛాతిలో నొప్పి వస్తే వెంటనే అప్రమత్తమవ్వాలి. గుండె రక్త నాళాలు మూసుకుపోయి రక్త ప్రసరణ తగ్గిపోవడంతోనే ఛాతిలో నొప్పి వస్తోంది. దీన్ని ‘ఎంజైనా’అంటారు. ఛాతిలో బరువుగా ఉండటం, నొప్పి వీపు వెనుక భాగంలోకి రావడం, గోంతులోకి, భుజం మీదికి పాకడం, ఆయాసం, కళ్లు తిరగడం, చెమటలు పట్టడం, కడుపులో గ్యాస్ ఏర్పడినట్లుగా మంట వస్తోంది. ఛాతిలో నొప్పి ప్రారంభమైన వెంటనే వైద్యుడిని సంప్రదించేలోగా ‘సార్బిట్రేట్, ఆస్ప్రిన్, స్టాటిన్ మాత్రలను వేయాలి. ఆ తర్వాత గంట వ్యవధిలోగా ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించగలిగితే ప్రాణాపాయ స్థితినుంచి కాపాడే అవకాశం ఉంది.