
ఏటీసీలో కార్పొరేట్ స్థాయి శిక్షణ
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: నూతనంగా ప్రారంభించిన ఏటీసీ సెంటర్‌లో విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య, శిక్షణ అందించనున్నట్లు ఎమ్మెల్యే యె న్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని మెట్టుగడ్డ వద్ద ఉన్న ఐటీఐ కళాశాలలో రూ.6.76 కోట్ల వ్య యంతో నిర్మించిన నూతన ఏటీసీ సెంటర్‌ను ఆన్‌లైన్ ద్వారా సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించగా.. నేరుగా కలెక్టర్ విజయేందిర, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది స్కిల్స్ ఉన్న యువత అవసరం ఉందని, కానీ, ఆ స్థాయిలో యువత అందుబాటులో లేరన్నారు. ఇందులో భాగంగా అవసరమైన స్కిల్స్ ఉన్న యువతను సిద్ధం చేసేందుకు ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 65 అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్లను ప్రారంభించిందన్నారు. ఇక్క డ ఏర్పాటు చేసి దీన్ని స్కిల్ యూనివర్సిటీకి అనుసంధానం చేస్తామన్నారు. ఇక్కడ శిక్షణ తీసుకుంటున్న యువతకు వచ్చే సంవత్సరం నుంచి రూ.2 వేల స్టైఫండ్ కూడా ఇస్తామని, ఖర్చుతో కూ డుకున్న బీటెక్ లాంటి కోర్సుల ద్వారా వచ్చే శిక్షణ నేరుగా ఏటీసీ సెంటర్ ద్వారా పొందేందుకు అవకాశం లభిస్తుందన్నా రు. ఈ క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కంపెనీలు ఇక్కడ చదివిన విద్యార్థులను రిక్రూట్ చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, ముడా చైర్మన్ లక్ష్మణ్‌యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ అనిత, మధుసూదన్‌రెడ్డి, ప్రిన్సిపాల్ శాంతయ్య, ఆనంద్‌గౌడ్, సిరాజ్‌ఖాద్రీ, అజ్మత్‌ఆలీ, సాయిబాబ తదితరులు పాల్గొన్నారు.