
అంతర్‌రాష్ట్ర దొంగల అరెస్టు
మక్తల్: అంతర్ రాష్ట్ర దొంగలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు నారాయణపట డీఎస్పీ లింగయ్య తెలిపారు. శుక్రవారం మక్తల్‌లో పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మక్తల్‌కు చెందిన రహ్మన్ ఇటీవల పట్టణంలో ఇంటి ఎదుట పార్కు చేసిన బైక్‌ను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారన్నారు. పోలీసులకు ప్రత్యే టీంను ఏర్పాటు చేసి పూర్తి స్తాయిల్లో దర్యాప్తు జరపగా.. కర్ణాటకకు చెందిన దుర్గప్ప, యల్లప్ప ముఠాగా ఏర్పడి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని పలు ప్రాంతాల్లో దొంగతనాలు చేస్తున్నారు. బైకులను చోరీ చేసి రాయిచూర్‌లో బైక్ మెకానిక్‌గా ఉన్న శంషోద్దీన్‌కు అప్పగించగా ఆయన వీటిని అమ్మేవాడు. దర్యాప్తులో ఈ విషయాలు వెల్లడికావడంతో శుక్రవారం నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించడంతో పాటు ఐదు బైకులను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. దొంగలను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన సిబ్బంది అశోక్, నరేష్, శ్రీకాంత్‌ను డీఎస్పీ అభినందించారు. కార్యక్రమంలో సీఐ రాంలాల్, ఎస్‌ఐ భాగ్యలక్ష్మీరెడ్డి, ఏఎస్‌ఐ శంకరయ్య, ఆచారి, అరున్ తదితరులు పాల్గొన్నారు.
ఐదు ద్విచక్రవాహనాలు స్వాధీనం