
టీజీపీఎస్సీ మెంబర్‌గా లక్ష్మీకాంత్ రాథోడ్
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: తెలంగాణ స్టేట్ ప బ్లిక్ కమిషన్ చైర్మన్‌గా పీ యూ మాజీ వీసీ లక్ష్మీకాంత్‌రాథోడ్‌ను నియమి స్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జా రీ చేసింది. ఈ మేరకు నారాయణ్‌పేట్ జిల్లా, తిమ్మారెడ్డిపల్లికి చెందిన ఆయన నిజాం కళాశాల ప్రిన్సిపాల్, ఓ యూ పీడీతో 2021–24 మధ్య పీయూకు వీసీతో పాటు వివిధ స్థాయి ల్లో బాధ్యతలు నిర్వహించారు. ఈ మేరకు ఆయనను టీజీపీఎస్సీ మెంబర్‌గా ప్ర భుత్వం నియమించడంపై లక్ష్మీకాంత్ రాథోడ్ ము ఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.
ఫోన్ ఇప్పించలేదని
యువకుడి ఆత్మహత్య
లింగాల: తల్లి సెల్‌ఫోన్ ఇప్పించలేదని క్షణికావేశానికై గురైన యువకుడు ఆత్మహత్యకు పా ల్పడిన ఘటన మండల కేంద్రంలో సోమవారం చోటు చే సుకుంది. గ్రామస్తులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన చరణ్(18) ఇటీవల జరిగిన గణేశ్ నిమజ్జనంలో ఫోన్ పోగొట్టుకున్నా డు. మరో ఫోన్ ఇప్పించాలని తల్లి గీతను కోరగా.. వేతనం వచ్చిన వెంటనే ఇప్పిస్తానని చెప్పింది. తల్లి మండల కేంద్రంలోని సీహెచ్‌సీలో పనిచేస్తుంది. ప ని నిమిత్తం నాగర్‌కర్నూల్‌కు వెళ్లగా.. ఇద్దరు అన్నదమ్ములు ఇంటిలోనే ఉన్నారు. ఒక గదిలో తమ్ముడు ఉండగా.. మరో గదిలో ఉన్న చరణ్ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తండ్రి దేవేందర్ ఇదివరకే మృతిచెందాడు. ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో
యువకుడి మృతి
● ఆటోను ఢీకొట్టిన డీసీఎం
కొత్తకోట రూరల్: ఆటోను డీసీఎం ఢీకొట్టిన ఘటనలో యువకుడు మృతి చెందిన ఘటన ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. కొత్తకోట ఎస్‌ఐ ఆనంద్ తెలిపిన వివరాలు.. అలంపూర్ మండలం సింగవరానికి చెందిన దూదేకుల రహీంబాష జిల్లా కేంద్రంలో ఓ ఇంట్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురితో కలిసి టైల్స్ వర్క్ చేస్తున్నారు. రోజువారీ పనిలో భాగంగా ఆదివారం మదనాపురం మండలం గోవిందహళ్లి(అగ్రారం)లో టైల్స్ వేసేందుకు ఆటోలో వెళ్లి రాత్రి కొత్తకోట సమీపంలో ఓ దాబా వద్ద భోజనం చేసి తిరిగి వనపర్తికి వెళ్తుండగా గుంపుగట్టు సమీపంలో ఎదురుగా వస్తున్న గుర్తు తెలియని డీసీఎం ఆటోను ఢీకొట్టింది. ప్రమాదంలో దూదేకుల రహీం బాష(25)కు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఆటోలో ఉన్న మిగిలిన ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.

టీజీపీఎస్సీ మెంబర్‌గా లక్ష్మీకాంత్ రాథోడ్

టీజీపీఎస్సీ మెంబర్‌గా లక్ష్మీకాంత్ రాథోడ్