గురుకుల పాఠశాలకు తాళం | - | Sakshi
Sakshi News home page

గురుకుల పాఠశాలకు తాళం

Oct 7 2025 3:27 AM | Updated on Oct 7 2025 3:27 AM

గురుకుల పాఠశాలకు తాళం

గురుకుల పాఠశాలకు తాళం

అద్దె చెల్లించకపోవడమే కారణం

ములుగు రూరల్‌ : తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల/కళాశాలకు తాళం వేసిన సంఘటన ములుగు జిల్లాకేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది. భవన యజమాని తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని భవనాన్ని బాలికల గురుకుల పాఠశాలకు గతేడాది అద్దెకు ఇచ్చామని తెలిపారు. విస్తీర్ణం ప్రకారం నెలకు రూ.2.60లక్షల అద్దె ఒప్పందం కుదుర్చుకున్నామని అన్నారు. ఏడాదిలో అద్దె డబ్బులు రూ.31.20లక్షలు చెల్లించాల్సి ఉందని వాపోయారు. గురుకుల పాఠశాలకు తాళం వేసిన విషయం తెలుసుకున్న కలెక్టర్‌, ఆర్డీఓ వెంకటేశ్‌తో సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. భవన యజమాని గొర్రె సాంబయ్యను పిలిపించి తక్షణం కలెక్టర్‌ నిధుల నుంచి రూ.4లక్షలు చెల్లిస్తామని తాళం తీసి సహకరించాలని కోరారు. దీంతో యజమాని పాఠశాల సిబ్బందికి తాళం అప్పగించారు.

గుట్కా స్వాధీనం

రఘునాథపల్లి : వరంగల్‌ టాస్క్‌ఫోర్స్‌, రఘునాథపల్లి పోలీసుల సంయుక్త తనిఖీలో అక్రమంగా తరలిస్తున్న రూ.24.44 లక్షల గుట్కాను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. ఎస్సై దూదిమెట్ల నరేష్‌ తెలిపిన కథనం ప్రకారం.. సోమవారం ఉదయం కోమళ్ల టోల్‌ ప్లాజా వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా వరంగల్‌ బట్టలబజార్‌కు చెందిన జాలం సింగ్‌రాజ్‌, పురోహిత్‌ జబ్బర్‌సింగ్‌ ఎలాంటి అనుమతి లేకుండా హైదరాబాద్‌ నుంచి వరంగల్‌ నగరానికి బొలెరో వాహనంలో అక్రమంగా గుట్కా తరలిస్తుండగా పట్టుకున్నారు. అనంతరం వాహనాన్ని స్వాధీనం చేసుకొని ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

గంజాయి వినియోగదారులకు జరిమానా

వరంగల్‌ లీగల్‌ : గుర్తుతెలియని వ్యక్తుల నుంచి గంజాయి కొనుగోలు చేసి వినియోగించిన ఇద్దరికి రూ.15వేల చొప్పున జరిమానా విధిస్తూ హనుమకొండ మొదటి అదనపు జిల్లా కోర్టు జడ్జి బి.అపర్ణాదేవి సోమవారం తీర్పు వెల్లడించారు. 2023 మార్చి 27న కాజీపేట ఎస్సై ప్రమోద్‌కుమార్‌ పెట్రోలింగ్‌ నిర్వహిస్తుండగా స్థానిక భవాని టాకీస్‌ సమీపంలో ఇద్దరు యువకులు చేతిలో ప్లాస్టిక్‌ కవర్స్‌తో అనుమానాస్పదంగా కనిపించారు. వెంటనే వారిని పట్టుకొని విచారించగా ఒకరు జ్యూస్‌ పాయింట్‌లో పనిచేసే ఎండీ నజీం అని, మరొకరు కరీంనగర్‌ జిల్లా వీణవంక మండల గనుముకుల గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్థి పలకాల విక్రాంత్‌రెడ్డి అని తెలి పారు. ఇరువురు గంజాయికి అలవాటు పడి గుర్తు తెలియని వారి నుంచి కొనుగోలు చేసి వినియోగిస్తున్నట్లు చెప్పారు. విక్రాంత్‌రెడ్డి చదువు ఒత్తిడితో నజీం వద్ద గంజాయి కొనుగోలు చేసి తీసుకెళ్తుండగా పోలీసులకు చిక్కాడు. నజీం వద్ద కిలోకు పైగా గంజాయి లభించగా, విక్రాంత్‌రెడ్డి వద్ద ఉన్న కవర్‌లో 500 గ్రాముల గంజాయి దొరికిందని పేర్కొన్నారు. వెంటనే ఇరువురిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. విచారణలో నేరం రుజు వు కావడంతో జడ్జి ఒక్కొక్కరికి రూ.15 వేల చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారు. కేసును ఎస్సై ఎం.శ్వేత పరిశోధించగా, లైజన్‌ ఆఫీసర్‌ పరమేశ్వరీ పర్యవేక్షణలో కా నిస్టేబుల్‌ సుధాకర్‌ సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. పీపీ మల్లారెడ్డి కేసు వాదించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement