
సృజనాత్మకతను వెలికితీయాలి
● కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్
● కంబాలపల్లి జెడ్పీ హైస్కూల్ తనిఖీ
మహబూబాబాద్ రూరల్: విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీసేలా పాఠ్యాంశాలను బోధించాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. మహబూబాబాద్ మండలంలోని కంబాలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని కిచెన్ షెడ్, డైనింగ్ హాల్, మరుగుదొడ్లు, లైబ్రరీ గదులు, పరిసరాలను పరిశీలించారు. అనంతరం విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి, సమాధానాలు రాబట్టారు. విద్యార్థులకు షెడ్యూల్డ్ ప్రకారం డిజిటల్ తరగతులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పాఠ్యాంశాలను పూర్తి చేయాలన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనంతో పాటు, మంచి విద్యను అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. క్రమం తప్పకుండా పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించాలని, వారి మానసిక, ఆరోగ్య స్థితిగతులను నిత్యం గమనిస్తూ ఉండాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ నిత్యం శానిటేషన్ చేయాలన్నారు. అనంతరం ముత్యాలమ్మగూడెం బాలికల ఆశ్రమ పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రం, మండల ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేసి పరిశీలించారు.
సమన్వయంతో పని చేయాలి
మహబూబాబాద్: అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో 2025–26ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందస్తు ప్రణాళికతో ధాన్యం కొనుగోలు కేంద్రాల ని ర్వహణ చేయాలన్నారు. 237 కేంద్రాల ఏర్పాటుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ధాన్యం సేకరణ, నిల్వ, రవాణా, గన్నీ బ్యాగులు తదితర ఏర్పాట్లు ముందస్తుగా చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అనిల్ కుమార్, అధికారులు పాల్గొన్నారు.

సృజనాత్మకతను వెలికితీయాలి