స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ సత్తాచాటాలి | - | Sakshi
Sakshi News home page

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ సత్తాచాటాలి

Oct 7 2025 3:55 AM | Updated on Oct 7 2025 3:55 AM

స్థాన

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ సత్తాచాటాలి

చిన్నగూడూరు: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ సత్తాచాటాలని డోర్నకల్‌ మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్‌ అన్నారు. సోమవారం మండలకేంద్రంలో ముఖ్యకార్యకర్తల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేనిఫెస్టో అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్‌ నాయకులను హామీల అమలుపై నిలదీయాలన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు రాంసింగ్‌, నాయకులు మంగపతిరావు, అయూబ్‌పాషా, ధారాసింగ్‌, చెన్నారెడ్డి, కొమిరెల్లి, ఉప్పలయ్య, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

బంగారం చోరీ

నిందితుల అరెస్ట్‌

మహబూబాబాద్‌ రూరల్‌ : బంగారు చెవి కమ్మలు దొంగిలించిన ముగ్గురు అంతర్రాష్ట్ర మహిళా దొంగలను అరెస్ట్‌ చేసినట్లు మహబూబాబాద్‌ టౌన్‌ సీఐ గట్ల మహేందర్‌ రెడ్డి తెలిపారు. ఈ మేరకు సోమవారం టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు వివరాలను వెల్లడించారు. ఖమ్మం జిల్లా మధిర మండలం రాయపట్నంకు చెందిన బొజ్జగాని నాగేంద్రమ్మ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ఎన్టీఆర్‌ జిల్లా వేర్లపాడు మండలం గోకరాజుపల్లికి చెందిన బాలసాని నాగమణి, మేచర్ల రేణుక ఒక ముఠాగా ఏర్పడి దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల పట్టణ పరిధిలోని ఓ జువెల్లరీ షాపులో బంగారం కొనడానికి కొద్ది రోజుల క్రితం ముగ్గురు మహిళలు వచ్చి చెవి కమ్మలను దొంగలించారు. ఈ విషయాన్ని గుర్తించిన షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీ ఫుటేజీలను పరిశీలించి విచారణ చేపట్టగా నేరం ఒప్పుకున్నారు. నిందితులు గతంలో భద్రాద్రి కొత్తగూడెం, పాల్వంచ, మధిర, నకిరేకల్‌, మహంకాళి పోలీసు స్టేషన్ల పరిధిలో పలు దొంగతనాలకు పాల్పడినట్లు సీఐ తెలిపారు. ఈ సమావేశంలో టౌన్‌ ఎస్సైలు అలీం హుస్సేన్‌, సిబ్బంది పాల్గొన్నారు.

దుప్పి మాంసం పట్టివేత

కాటారం(మహాముత్తారం): మహాముత్తారం మండలం రెడ్డిపల్లిలో ఇంట్లో వండిన దుప్పి మాంసాన్ని సోమవారం అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. పెగడపల్లి రేంజర్‌ వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రయ్య త న మేకలు, కుక్కలను తీసుకొని ప్రతి రోజు అట వీ ప్రాంతానికి మేపడం కోసం తీసుకెళ్తాడు. సోమవారం అటవీ ప్రాంతానికి వెళ్లగా గుర్తు తె లియని అటవీ జంతువులు వేటాడి చంపిన దుప్పి మాంసం చెట్ల పొదల్లో లభించింది. భ ద్రయ్య మాంసంను ఇంటికి తెచ్చుకొని వంట చేసుకున్నాడు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు దాడిచేసి వండిన దుప్పి మాంసం పట్టుకున్నారు. నిందితుడు భద్రయ్య వివరాలు ఒప్పుకోవడంతో అరెస్ట్‌ చేసి కోర్టు ఎదుట హాజరుపర్చినట్లు రేంజర్‌ తెలిపారు.

మానేరుకు జలకళ

మల్హర్‌: మండలంతో పాటు భూపాలపల్లి, కరీంనగర్‌ జిల్లాలో కురిసిన వర్షాలతో సోమవారం తాడిచర్ల–ఖమ్మంపల్లి మానేరుకు భారీగా వరద నీరు చేరుకుంది. దీనికి తోడు కరీంనగర్‌ డ్యాం గేట్లు ఎత్తడంతో వాగుకు ఇరువైపుల నీరు ప్రవహించడంతో మానేరుకు జలకళ సంతరించుకుని నిండుకుండలా దర్శనమిస్తుంది. అడవి సోమన్‌పల్లి, కొయ్యూరు పీవీనగర్‌కు మధ్యలో ఏర్పాటుచేసిన చెక్‌డ్యాం మీదుగా వరద నీరు పరవళ్లు తొక్కుతోంది. వర్షాల కారణంగా చిన్నతూండ్ల ఆరెవాగు ఒడ్డుకు ఇరువైపులా వరద నీరు ప్రవహిస్తుంది.

దేవాదుల మొదటి మోటార్‌ ట్రయల్‌ రన్‌ సక్సెస్‌

హసన్‌పర్తి : దేవాదుల ప్రాజెక్ట్‌–3వ దశలో భాగంగా నిర్వహించిన ట్రయన్‌ రన్‌ విజయవంతమైంది. సోమవారం మొదటి మోటారును రన్‌ చేశారు. హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం దేవన్నపేటలోని పంప్‌హౌస్‌ నుంచి ధర్మసాగర్‌ రిజర్వాయర్‌లోకి నీటిని విడుదల చేశా రు. ఐదు నెలల క్రితం రెండో మోటారు భారీ నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించారు. మూడో మోటారు ట్రయల్‌ రన్‌కు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు ఈఈ మంగీలాల్‌, బాలకృష్ణ తదితరులు తెలిపారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ సత్తాచాటాలి
1
1/2

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ సత్తాచాటాలి

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ సత్తాచాటాలి
2
2/2

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ సత్తాచాటాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement