
మక్కకు మద్దతేది?
సాక్షి, మహబూబాబాద్: ఆరుగాలం కష్టపడి పండించిన పంట ఉత్పత్తులకు మద్దతు ధర లభించడం లేదు. ప్రభుత్వం వరికి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని చెబుతున్నా.. ఆ పంటలను సాగు చేసిన రైతుల కష్టాలను మాత్రం పట్టించుకోవడం లేదు. జిల్లాలో ప్రతీ ఏడాది మొక్కజొన్న సాగు విస్తీర్ణం పెరుగుతున్నా.. ప్రభుత్వం అందించే కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసే దిక్కులేదు. దీంతో ప్రైవేట్ వ్యాపారులు చెప్పిందే వేదంగా మొక్కజొన్నలు కొనుగోలు చేసి రైతులను దోపిడీ చేస్తున్నారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర కల్పించాలని కోరుతున్నారు.
పెరుగుతున్న మొక్కజొన్న సాగు
వరి, ఇతర పంటలు సాగు చేస్తే ఆశించిన స్థాయిలో దిగుబడి, లాభాలు రావడంలేదని, మొక్కజొన్న సా గు వైపు మొగ్గు చూపుతున్నారు. గతంలో నామమాత్రంగా సాగు చేసిన రైతులు ఇప్పుడు అదే పంటను ప్రధానపంటగా సాగు చేస్తున్నారు. కొత్తగూ డ, గంగారం, గూడూరుతోపాటు అన్ని మండలా ల్లో మొక్కజొన్న సాగు విస్తీర్ణం పెరిగింది. గత మూ డు సంవత్సరాల క్రితం 40 వేల ఎకరాలకు పరిమి తమైన మక్క సాగు ఇప్పుడు 65వేల ఎకరాలకు చేరుకుంది. ఏడాదికి రెండు పంటలు సాగు చేయడంతో మొక్కల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది.
పెరిగిన పెట్టుబడి..
గతంతో పోలిస్తే అన్ని పంటలతోపాటు మొక్కజొ న్న సాగుకు పెట్టుబడి పెరిగింది. ఎకరాకు రూ.15వేల నుంచి రూ.20వేల అయ్యే ఖర్చు ఇప్పు డు రూ. 30 వేలకు చేరిందని రైతులు చెబుతున్నారు. ఈ ఏడాది వానాకాలంలో యూరియా కొరత పుణ్యమా అని సకాలంలో యూరియా వేయలేని పరిస్థితి. బ్లాక్‌లో కొనుగోలు చేసి యూరియా వేసిన రైతులు కూడా ఉన్నారు. వాతావరణం అనుకూలించి ఏ ఇబ్బందులు లేకపోతే ఎకరాకు 40 క్వింటాల మేరకు దిగుబడి వస్తుంది. అయితే ఈ ఏడాది సకాలంలో యూరియా వేయకపోవడంతో కంకి నాసిరకంగా పోసిందని, సగానికి దిగుబడి తగ్గుతోందని రైతులు చెబుతున్నారు.
వ్యాపారుల దోపిడీ
కష్టపడి రైతులు పండించిన ఉత్పత్తులకు మద్దతు ధర కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా మొక్కజొన్నకు కనీస మద్దతు ధర రూ.2,400 ప్రకటించింది. అయితే కోవిడ్ కారణంగా 2019 వరకు ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేసింది. అనంతరం మహబూబాబాద్, కేసముద్రం మార్కెట్‌లలో మద్దతు ధరకు కొనుగోళ్లు నిలిపేశారు. దీంతో వ్యాపారులు పెట్టిందే ధరగా కొనసాగుతోంది. ప్రస్తుతం క్వింటాకు ఒకటి రెండు కూట్లకు రూ. 2 వేల మేరకు ధర పెట్టి మిగిలిన వాటిని రూ.1,500 నుంచి రూ.1,800 వరకు కొంటున్నారు. దీంతో రైతులు క్వింటాకు రూ. 500 నుంచి రూ. 900 వరకు నష్టపోతున్నారు. అదే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే రైతులకు నష్టం వాటిల్లేది కాదని చెబుతున్నారు.
మొక్కజొన్న సాగు వివరాలు (ఎకరాల్లో..)
జిల్లాలో పెరుగుతున్న మొక్కజొన్న సాగు
ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో
మద్దతు ధర కరువు
ఇష్టారాజ్యంగా ప్రైవేట్ వ్యాపారుల దోపిడీ
ప్రభుత్వం చొరవ చూపాలని
రైతుల వేడుకోలు
2023 51,777
2024 56,643
2025 62,621

మక్కకు మద్దతేది?

మక్కకు మద్దతేది?