
నేడు పీఎంశ్రీ స్కూల్స్ టీచర్లకు శిక్షణ
విద్యారణ్యపురి : ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పీఎంశ్రీ పాఠశాలల టీచర్లకు డిజిటల్ కంటెంట్‌తో త్రీడీ మోడల్‌లో విద్యాబోధనకు గాను నేడు మంగళవారం శిక్షణ ఇవ్వనున్నారు. హైదరాబాద్ నుంచి టెక్నికల్ రిసోర్స్ పర్సన్లు ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చాక వాటిని ఎలా వినియోగించుకోవాలనేది విద్యార్థులకు ఏఆర్, వీఆర్‌ను అమలు చేస్తారు. ముఖ్యంగా గణితం, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, ఇంగ్లిష్ టీచర్లు, హెచ్‌ఎంలు శిక్షణకు హాజరు కావాల్సి ఉంటుంది. హనుమకొండ జిల్లాలో 19 పీఎం శ్రీ స్కూల్స్ ఉండగా అందులో మడికొండలోని జిల్లా పరిషత్ హైస్కూల్, ఒంటిమామిడిపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న స్కూల్స్‌కు ఏఆర్, వీఆర్ అమలుకు ఎంపిక చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎంపికై న ఆయా పాఠశాలలకు ఒక్కో స్కూల్‌కు 25 చిన్నట్యాబ్‌లు, 10 చొప్పున త్రీడీ పరికరాలు, టీచర్‌కు ఒక పెద్ద ట్యాబ్ చొప్పున రాష్ట్ర విద్యాశాఖ సమగ్ర శిక్ష అధికారులు ఇప్పటికే పంపిణీ చేశారు.
● వరంగల్ జిల్లాలో రెండు నర్సంపేట జిల్లా ప రిషత్ గర్ల్స్ హైస్కూల్, రాయపర్తి మండలం కొండూరు జెడ్పీఎస్‌ఎస్ ఎంపికై ంది. నర్సంపేటలో జె డ్పీఎస్‌ఎస్ బాలికల పాఠశాలలో శిక్షణ ఉంటుంది.
● జనగామ జిల్లాలోని ధర్మకంచ జెడ్పీ ఉన్నత పాఠశాల, ములుగు జిల్లాలో ఏటూరునాగారం జెడ్పీఎస్‌ఎస్ వీరికి మడికొండ హైస్కూల్‌లో శిక్షణ ఉంటుంది.
● జయశంకర్ భూపాలపల్లిలోని గొల్లబుద్దారం జెడ్పీఎస్‌ఎస్ ఎంపికైంది.
● మహబూబాబాద్ జిల్లాలో నాలుగు పీఎంశ్రీ స్కూల్స్ మహబూబాబాద్ జిల్లా పరిషత్ గర్ల్స్ హైస్కూల్, తొర్రూరు, దంతాలపల్లి జెడ్పీఎస్‌ఎస్, గూడూరు మండలం పొనుగోడు జెడ్పీఎస్‌ఎస్‌ను ఎంపిక చేశారు. ఆయా టీచర్లకు మహబూబాబాద్ గర్ల్స్ హైస్కూల్స్‌లో శిక్షణ ఇవ్వనున్నారు.