
విద్యార్థుల ప్రతిభకు
దరఖాస్తులు ఇలా..
విద్యార్థుల సృజనాత్మకతకు పదును..
‘విజ్ఞాన్ మంథన్’
కాళోజీ సెంటర్ : దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో 6వ తరగతి నుంచి ఇంటర్ (11వ తరగతి) వరకు చదువుతున్న విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు విద్యార్థి విజ్ఞాన్ మంథన్ కార్యక్రమం దోహదపడుతుంది. కేంద్ర ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక సమాచార సంస్థ ఆధ్వర్యంలోఎన్‌సీఈఆర్‌టీ విజ్ఞాన్ ప్రసార్, విజ్ఞాన భారతి సంస్థలు సంయుక్తంగా ప్రతి ఏటా ఈ పరీక్షలు నిర్వహిస్తున్నా యి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అన్ని యా జ మాన్య పాఠశాలల విద్యార్థుల నుంచి రిజిస్ట్రేషన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. జా తీయ ప్రతిభ అన్వేషణ పరీక్ష విద్యార్థి విజ్ఞాన్ మ ంథన్ (వీవీఎం–2025–26) ఆన్‌లైన్ విధానంలో ఓపెన్ బుక్ పద్ధతి ద్వారా విద్యార్థులు ఇంటి వద్ద నుంచే రాసుకోవచ్చు. విజ్ఞాన, సామాజిక శాస్త్రాల అధ్యయనంపై విద్యార్థులు ఉత్తమ పరిశోధకులుగా ఎది గి భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దే ఉద్దేశంతో విద్యార్థి విజ్ఞాన్ మంథన్ (వీవీఎం) నిర్వహిస్తున్నారు.
సైన్స్‌పై పిల్లలకు ఆసక్తి కలిగించుట, శాస్త్ర సాంకేతిక ప్రపంచ అభివృద్ధిలో భారతీయుల కృషిని పాఠశాల విద్యార్థులకు తెలియజేస్తారు. ఉన్నత స్థాయి వైజ్ఞానిక విద్యను అభ్యసించేందుకు పిల్లలు అవసరమైన మార్గాలను ఏర్పాటు చేస్తారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పరీక్షల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను సత్కరించి ప్రోత్సహిస్తారు. జాతీయ స్థాయిలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు భాస్కర స్కాలర్‌షిప్ పథకం ద్వారా ఉపకార వేతన లభిస్తుంది.
విద్యార్థి విజ్ఞాన్ మంథన్ 2025–26 పరీక్షలో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా ఉన్న సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, స్టేట్ బోర్డు అనుమతి పొందిన పాఠశాలల్లో 6, 7, 8 తరగతుల విద్యార్థులను జూనియర్, 9, 10, 11 తరగతుల విద్యార్థులు సీనియర్ విభాగంలో పాల్గొనవచ్చు. ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు మాత్రమే అర్హులు. ఆన్‌లైన్‌లోనే పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ఇంగ్లిష్, హిందీతో పాటు ప్రధానమైన 14 రీజనల్ భాషలో ఉంటుంది. ప్రతిభ కనబర్చడానికి నాలుగు దశలో పరీక్ష నిర్వహిస్తారు.
ప్రతి తరగతి నుంచి మొదటి ఇద్దరు విద్యార్థులను ఆయా రాష్ట్రం నుంచి జాతీయ స్థాయి క్యాంపులకు ఎంపిక చేస్తారు. మొదటి బహుమతి రూ.25 వేలు, రెండో బహుమతి రూ.15 వేలు, మూడో బహుమతి రూ.10 వేల చొప్పున అందజేస్తారు. అదే విధంగా జాతీయస్థాయిలో అదనంగా దేశంలోని నాలుగు జోన్ల నుంచి ప్రతి తరగతి నుంచి మొత్తం 18 మందికి పారితోషికాలు ఇస్తారు. జాతీయస్థాయి విజేతలకు నెలకు రూ.2 వేల చొప్పున ఏడాది పాటు భాస్కర స్కాలర్‌షిప్ అందజేస్తారు.
పరీక్షకు హాజరయ్యే విద్యార్థి రూ.200ల ఫీజు చెల్లించి దరఖాస్తును www.vvm.org.in ఆన్‌లైన్ ద్వారా పేరు నమోదు చేసుకోవాలి. పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌ను సందర్శించాలి. విద్యార్థి వ్యక్తిగతంగా లేదా పాఠశాల నుంచి రిజిస్టర్ చేసుకోవాలి. పాఠశాల ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకుంటే ఎంపిక చేసిన కేంద్రాల్లో ఆన్‌లైన్ ద్వారా పరీక్ష నిర్వహిస్తారు. కనీసం 50 మంది ఒకే పాఠశాలలో పరీక్ష రాయడానికి ఉన్నట్లయితే అక్కడే కంప్యూటర్, ఇంటర్‌నెట్ సౌకర్యం ఉంటే అదే సెంటర్‌ను కేటాయించే అవకాశం ఉంది. ఈనెల 30వ తేదీ వరకు పాఠశాలల ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. పరీక్ష వచ్చే నెలలో ఉండే అవకాశం ఉంది. పరీక్ష సమయం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 8 గంటల మధ్య ఎప్పుడైనా 90 నిమిషాలు మాత్రమే ఉంటుంది.
ఉమ్మడి జిల్లాలోని 6నుంచి ఇంటర్ విద్యార్థులకు సువర్ణావకాశం
2025–26 దరఖాస్తుల స్వీకరణ
ఆన్‌లైన్‌లో పేరు నమోదు చేసుకోవాలి
రిజిస్ట్రేషన్‌కు ఈనెల 30 చివరి గడువు
విద్యార్థి విజ్ఞాన్ మంథన్ 2025–26 పరీక్ష ద్వారా విద్యార్థుల సృజనాత్మకతకు పదును పెట్టే అవకాశం ఉంది. ఈ పరీక్షలో పాల్గొనేందుకు ఆయా పాఠశాలల సైన్స్ టీచర్లు విద్యార్థులను ప్రోత్సహించి వారి ప్రతిభను వెలికితీయాల్సిన అవసరం ఉంది. ఈ పరీక్షలో పాల్గొనే విద్యార్థులు వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ పొంది ఉండాలి. అర్హతగల పాఠశాలకు విజ్ఞాన్ మంథన్‌తో సువర్ణావకాశం లభిస్తుంది. దీనిపై అవగాహన కల్పించి ప్రోత్సహించాలి. – డాక్టర్ కట్ల శ్రీనివాస్, జిల్లా సైన్స్ అధికారి,వరంగల్

విద్యార్థుల ప్రతిభకు