
వైఎస్సార్ సీపీలో చేరిన వైఎస్సార్ కాలనీ మహిళలు
భవానీపురం(విజయవాడపశ్చిమ): ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం పరిధిలోని జక్కంపూడి వైఎస్సార్ కాలనీకి చెందిన పలువురు మహిళలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాలనీకి చెందిన పెద్ది రాంబాయిమ్మ ఆధ్వర్యంలో 30 మంది మహిళలు తెలుగు దేశం పార్టీ నుంచి వైఎస్సార్ సీపీలో జాయిన్ అయ్యారు. ఇబ్రహీంపట్నంలోని మాజీ మంత్రి, మైలవరం నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జ్ జోగి రమేష్ నివాసంలో ఆదివారం ఈ చేరికలు జరిగాయి. పార్టీలో చేరిన మహిళలను ఆయన సాదరంగా ఆహ్వానించి పార్టీ కండువాలు కప్పారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జక్కంపూడి వైఎస్సార్ కాలనీలో పార్టీని మరింత బలోపేతం చేయాలని కోరారు. కార్యక్రమంలో విజయవాడ రూరల్ మండలం వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు బయ్యారపు రవికిషోర్, ఎంపీటీసీలు కొరగంజి సత్యనారాయణ, షేక్ సైదాబీ వలీ, కాలనీ నాయకులు నక్కా ప్రభుదాస్, మారపాక రాంబాబు, కుంభా నాగరాజు, ముళ్ల లాజర్, టీఎల్ రాజు, ఎస్‌కే షరీఫ్, గద్దల లాజర్, విన్నపాల రంగారావు, చల్లా అర్జున్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన మహిళలు జోగి రమేష్‌ను సత్కరించారు.