న్యూస్‌రీల్
ఇబ్రహీంపట్నం గోడౌన్‌లో భారీగా పట్టుబడిన కల్తీ మద్యం తయారీ కేంద్రాన్ని గుర్తించి యంత్రాలను స్వాధీనం చేసుకున్న ఎకై ్సజ్ శాఖ పోలీసులు పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దన్‌రావు ఎకై ్సజ్ పోలీసుల అదుపులో జనార్దన్‌రావు తమ్ముడు, గుమస్తా
మంగళవారం శ్రీ 7 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 37,511 క్యూసెక్కులు వచ్చి చేరు తుంది. ప్రాజెక్టు నుంచి దిగువకు 32,511 క్యూసెక్కులు వదులుతున్నారు.
దుర్గమ్మ సేవలో ఐఆర్‌ఎస్ సునీత బిల్లా
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇన్‌కంటాక్స్ ప్రిన్సిపల్ కమిషనర్, ఐఆర్‌ఎస్ అధికారి సునీత బిల్లా సోమవారం ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను దర్శించుకున్నారు.
వైద్యశాలను సందర్శించిన డీఎంహెచ్‌ఓ
కోడూరు: కోడూరు మండలం స్వతంత్రపురం పీహెచ్‌సీని సోమవారం జిల్లా వైద్యాధికారి అంబటి వెంకట రమణ సందర్శించారు. కుక్క, పాము కాటు వ్యాక్సిన్ల నిల్వలపై ఆరా తీశారు.
జి.కొండూరు/ఇబ్రహీంపట్నం: ములకలచెరువులో కల్తీ మద్యం రాకెట్ వెలుగులోకి వచ్చిన తర్వాత ఇబ్రహీంపట్నంకు చెందిన టీడీపీ నేత అద్దేపల్లి జనార్దన్‌రావు వ్యవహారం బట్టబయలైంది. ఈ కేసులో ఆయన ఏ1 నిందితుడు కావడంతో ఎకై ్సజ్ శాఖ అధికారులు ఇబ్రహీంపట్నంపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలో జనార్దన్‌రావుకు చెందిన ఏఎన్‌ఆర్ బార్‌ని ఆదివారం రాత్రి సీజ్ చేసిన పోలీసులు సోమవారం ఉదయం సోదాలు చేపట్టారు. జనార్దన్‌రావు పరారీలో ఉండడంతో ఆయన తమ్ముడు జగన్‌మోహన్ రావును, గుమస్తా కట్టా రాజుని అదుపులోకి తీసుకుని విచారించారు. వారు చెప్పిన వివరాల ప్రకారం ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్‌కు సమీపంలో ఉన్న ఏఎన్‌ఆర్ బార్‌కి ఎదురుగా ఉన్న కాంప్లెక్స్‌లోని ఓ గోడౌన్‌లో భారీగా కల్తీ మద్యం, బాటిలింగ్ చేసే యంత్రం, ఖాళీ క్వార్టర్ బాటిళ్లు, కల్తీ మద్యం నింపిన బాటిళ్లు పట్టుబడ్డాయి. ఈ క్రమంలో ఎకై ్సజ్ శాఖ అధికారులు జనార్దన్‌రావు గతంలో బార్ నిర్వహించిన పాత భవనంలో కల్తీ మద్యం తయారీ కేంద్రాన్ని గుర్తించారు. ఇక్కడ కల్తీ మద్యం మిక్సింగ్ చేసే యంత్రాలు, స్టీలు డ్రమ్ములు, గతంలో మద్యం నింపిన ఖాళీ క్యాన్‌లు స్వాధీనం చేసుకున్నారు.
ఇబ్రహీంపట్నంలో పట్టుబడిన మద్యం
భారీగా పట్టుబడిన కల్తీ మద్యంను గొల్లపూడిలోని ఎకై ్సజ్ శాఖ కార్యాలయానికి తరలించినట్టు అధికారులు మీడియాకు వెల్లడించారు. పట్టుబడిన కల్తీ మద్యంలో ఓల్డ్ అడ్మినరల్ పేరుతో ఉన్న 129.6లీటర్ల 720 బాటిళ్లు, క్లాసిక్ బ్లూ పేరుతో ఉన్న 25.92 లీటర్ల 144 బాటిళ్లు, కేరళ మాల్ట్ పేరుతో ఉన్న 69.12 లీటర్ల 384 బాటిళ్లు, మంజీరా బ్లూ పేరుతో ఉన్న 4.32 లీటర్ల 24 బాటిళ్లు, లేబుళ్లు అతికించని 1175.04 లీటర్ల 6528 బాటిళ్ల మద్యం, 95 క్యాన్‌లలో ఉన్న మిక్సింగ్ స్పిరిట్ 3325 లీటర్లు, ఓల్డ్ అడ్మినరల్ పేరుతో ఉన్న 6500 లేబుళ్లు, 2200 ఖాళీ బాటిళ్లు, క్యాన్‌లు 4, పైపులు రెండింటిని స్వాధీనం చేసుకున్నారు. పాత ఏఎన్‌ఆర్ బార్ భవనంలో తయారీ కేంద్రంలో లభ్యమైన కల్తీ మద్యం తయారీ యంత్రాలు, స్టీలు డ్రమ్ములు, ప్లాస్టిక్ క్యాన్‌లు అదనంగా దొరికాయి.
పేద మందుబాబులే టార్గెట్
పేద, మధ్య తరగతికి చెందిన మందుబాబులే టార్గెట్‌గా కల్తీ మద్యం రాకెట్ నడిచింది. బెల్టు షాపులు, బార్‌లలో అధికంగా విక్రయాలు జరిగే బ్రాండ్ల పేరుతోనే నకిలీ లేబుళ్లను తయారు చేసి కల్తీ మద్యం నింపి విక్రయించినట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మద్యం దుకాణాలకు అనుమతులు ఇచ్చిన నాటి నుంచి ఈ దందాను కొనసాగించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా గ్రామాల్లో బెల్టు షాపులను ఎంపిక చేసుకుని మరీ సరఫరా చేశారని సమాచారం. రూ.కోట్లల్లో ఈ దందా కొనసాగింది. ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దన్‌రావు టీడీపీ నేత కావడంతో పాటు స్థానికంగా ఉన్న టీడీపీ నేతలతో కూడా సత్సంబంధాలు ఉన్న నేపథ్యంలో ఈ కల్తీ మద్యం రాకెట్‌లో ఎవరి పాత్ర ఏమిటో తేలాల్సి ఉంది.
7
కల్తీ మద్యం తయారీ ఇలా...
వేల లీటర్ల రెక్టిఫైడ్ స్పిరిట్‌ని క్యాన్‌లలో తీసుకొచ్చి దానికి క్యారెమెల్, వాటర్ కలిపి స్పూరియస్ లిక్కర్(కల్తీ మద్యం) తయారు చేస్తారు. ఈ విధంగా ఒక లీటరు స్పిరిట్‌కు 180 ఎంఎల్ కల్తీ మద్యం బాటిళ్లను 135 వరకు తయారు చేస్తారు. ఈ విధంగా తయారైన కల్తీ మద్యంను మార్కెట్లో ఉన్న మద్యం బాటిళ్ల లేబుళ్లు మాదిరిగా డూప్లికేట్ లేబుళ్లను తయారు చేసి ప్లాస్టిక్ బాటిళ్లలో నింపి బెల్టు షాపులు, బార్‌లకు విక్రయిస్తారు. ఈ కల్తీ మద్యంను ఒక్కొక్క బాటిల్‌పై ఎంఆర్‌పీను బట్టి రూ.20 నుంచి రూ.40 వరకు తగ్గించి హోల్‌సేల్ ధరలకు బెల్టు షాపులు, బార్‌లకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దన్‌రావుకు చెందిన ఏఎన్‌ఆర్ బార్‌తో పాటు అతని భాగస్వామ్యంతో నడుస్తున్న భవానీపురం శ్రీనివాస వైన్స్, కంచికచర్లలోని ఓ వైన్‌షాపుతో పాటు కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఈ కల్తీ మద్యం విక్రయాలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ కల్తీ మద్యం తయారీకి స్థానికంగా ఉండే కార్మికులైతే గుట్టు రట్టయ్యే అవకాశం ఉండడంతో జనార్దన్‌రావు గుమస్తా కట్టా రాజు పర్యవేక్షణలో ఒడిశా, కేరళకు చెందిన కార్మికులతో కల్తీ మద్యం తయారు చేయిస్తున్నారని తెలుస్తోంది. ములకలచెరువులో కల్తీ మద్యం గుట్టురట్టు కావడంతో కార్మికులను వెంటనే ఇబ్రహీంపట్నంలో ఉన్న తయారీ కేంద్రం నుంచి వారివారి ప్రాంతాలకు తరలించినట్లు సమాచారం.
తీగ లాగితే డొంక కదిలినట్టు ములకల చెరువులో కల్తీ మద్యం రాకెట్ వెనుక ఇబ్రహీంపట్నం టీడీపీ నేత హస్తం బట్టబయలైంది. స్థానికంగా ఆయనకు చెందిన ఒక గోడౌన్‌లో ఇతర రాష్ట్రాల కార్మికులతో కల్తీ మద్యం తయారు చేయించి, ఆ బాటిళ్లపై ప్రముఖ బ్రాండ్ల లేబుళ్లు వేసి ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో బెల్టు షాపులకు, బార్‌లకు సరఫరా చేస్తున్నట్టు తెలిసింది. ఈ విషయం వెల్లడవడంతో ఈ ప్రాంత మందుబాబులు ఉలిక్కిపడుతున్నారు.
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా