అధికారులకు కలెక్టర్ బాలాజీ సూచన మీకోసంలో 168 అర్జీలు స్వీకరణ
చిలకలపూడి(మచిలీపట్నం): ప్రజలు మీకోసం కార్యక్రమంలో ఇచ్చే అర్జీల పరిష్కార విధానంపై అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం) కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్‌తో పాటు జేసీ ఎం.నవీన్, అసిస్టెంట్ కలెక్టర్ జాహిద్ ఫర్హీన్, డీఆర్వో చంద్రశేఖరరావు, కేఆర్‌ఆర్‌సీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, ఏఎస్పీ సత్యనారాయణ, ఆర్డీవో స్వాతి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ భూ రికార్డులు, ల్యాండ్ సర్వే, రహదారులు, భవనాల శాఖకు సంబంధించి అర్జీలు అత్యధికంగా పెండింగ్‌లో ఉన్నాయన్నారు. వాటిపై ప్రత్యేక దృష్టి సారించి నిర్ణీత సమయానికి పరిష్కరించాలన్నారు. అర్జీలు పరిష్కరించే విధానం, వాటిని ఆన్‌లైన్ సమర్పించే ప్రక్రియపై పీజీఆర్‌ఎస్ ఆన్‌లైన్ పోర్టల్‌ను ప్రదర్శించి అర్జీలకు సరైన రీతిలో ఎండార్స్‌మెంట్ ఇవ్వాల్సిన ప్రక్రియను ఆయన వివరించారు. మీకోసం కార్యక్రమంలో అధికారులు 128 అర్జీలను స్వీకరించారు.
అర్జీలు ఇవే :
●ఇటీవల జీఎస్టీ తగ్గింపు వలన ఏర్పడిన ప్రయోజనాలు ప్రజలకు అందేలా ఆదేశాలు జారీ చేయాలని, సామాన్య ప్రజలకు తగ్గింపులో ఆర్ధిక ప్రయోజనాలు అందేలా ప్రోత్సహించే విధంగా చర్యలు చేపట్టాలని సీపీఎం నగర కమిటీ కార్యదర్శి బూర సుబ్రహ్మణ్యం అర్జీ ఇచ్చారు.
●హైకోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తానని ఎ.ధనుష్, సింధు తమ వద్ద నుంచి రూ.3.5 లక్షలు వసూలు చేసి మోసం చేశారని తిరిగి ఆ నగదు ఇప్పించే విధంగా న్యాయం చేయాలని కోరుతూ ఉయ్యూరు మండలం వీరవల్లి గ్రామానికి చెందిన యలవర్తి దేవీమీనాక్షి అర్జీ ఇచ్చారు.