ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్
నున్న(విజయవాడరూరల్): మహిళ ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబం సుభిక్షంగా ఉంటుందని రాష్ట్ర ఆరోగ్యకుటుంబ సంక్షేమశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. నున్న గ్రామంలో గురువారం నిర్వహించిన స్వాస్ధనారి ససక్త పరివార అభియాన్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన వైద్య శిబిరంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ స్ఫూర్తితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తుందని చెప్పారు. మహిళల్లో పెరుగుతున్న క్యాన్సర్ వ్యాధుల నేపథ్యంలో నోటి, రొమ్ము, గర్భాశయ ముఖద్వార వైద్య పరీక్షలను చేయించుకోవాలని సూచించారు.
ప్రాథమిక దశలో వాటిని గుర్తిస్తే నివారణ సులభంగా ఉంటుందన్నారు. వైద్య శిబిరాల్లో 14 రకాల వైద్య పరీక్షలు చేస్తారని, ఇప్పటి వరకు 16,500 వైద్య శిబిరాల్లో 34 లక్షల మందికి వైద్య పరీక్షలు చేయించామని వెల్లడించారు. రక్తహీనతతో బాధపడుతున్న మహిళలు మునగ ఆకు తీసుకోవాలని తెలిపారు. తొలుత పండిట్ దీన్ దయాళ్ చిత్ర పటానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎం.సుహాసిని, డాక్టర్ సతీష్ కుమార్, డాక్టర్ నిర్మల గ్లోరీ, డాక్టర్ శిరీష, డాక్టర్ మోతిబాబు,మెడికల్ ఆఫీసర్ డాక్టర్ విజయ్ , వైద్య సిబ్బంది నున్న సొసైటీ ఛైర్మన్ కె.శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నూతన వరి వంగడాలను పరిశీలించిన శాస్త్రవేత్తలు
అవనిగడ్డ:ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఘంటసాల కృషి వి/్ఙాన కేంద్రం, కృష్ణా జిల్లా కేవీకే శాస్త్రవేత్తల బృందం అవనిగడ్డలో చిరుపొట్ట దశలో ఉన్న వరి వంగడాలను (బీపీటీ 3284 ఆర్జిఎల్ –7034) క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కృషి వి/్ఞాన కేంద్రం సమన్వయ కర్త డాక్టర్ డి.సుధారాణి రైతులకు పలు సూచనలు చేశారు. నూతన వరి వంగడాల వల్ల ఖర్చులు తగ్గించుకుని దిగుబడి పెంచుకోవచ్చన్నారు. జిల్లా వనరుల కేంద్రం మచిలీపట్నం, ఘంటసాల, కృషి వి/్ఞాన కేంద్రం నిర్వహించిన ఈ కార్యక్రమంలో డీడీవో జ్యోతి రమణి, అవనిగడ్డ ఏడీ జయప్రద, శ్రీనివాస్, కృషి వి/్ఙాన కేంద్రం శాస్త్రవేత్తలు రేవతి, వెంకటలక్ష్మి, ఏఓ పద్మజ, సంజీవ్, హారిక, అవనిగడ్డ సబ్ డివిజన్ వీఏఏలు పాల్గొన్నారు.

దీనదయాళ్ స్ఫూర్తితో వైద్య శిబిరాలు