తీరు మారలేదే! | - | Sakshi
Sakshi News home page

తీరు మారలేదే!

Oct 6 2025 6:31 AM | Updated on Oct 6 2025 6:31 AM

తీరు మారలేదే!

తీరు మారలేదే!

నేతలు ఆహ్వానించినా స్పందించని వైనం

ఎంపీ క్యాంపు కార్యాలయం

ఏర్పాటు చేసినట్లు ప్రచారం

గ్రామాల్లోనూ ఎంపీ, ఎమ్మెల్యే వర్గాలుగా విడిపోయిన ‘తమ్ముళ్లు’

తిరువూరు: ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో విభేదాలు మరోమారు బహిర్గతమయ్యాయి. తిరువూరు మండల, పట్టణ టీడీపీ కార్యాలయాలను ఒకే ప్రాంగణంలో ఏర్పాటు చేసే నిమిత్తం నెలరోజులుగా పనులు జరుగుతున్నాయి. ఆదివారం ఈ కార్యాలయ ప్రారంభోత్సవం చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఎంపీ కార్యాలయం శనివారం ప్రారంభోత్సవానికి సంబంధించిన ఆహ్వాన సమాచారాన్ని స్థానిక వాట్సాప్‌ గ్రూపుల్లో పోస్టు చేసింది. ఎంపీ కేశినేని శివనాథ్‌ (చిన్ని), తిరువూరు నియోజకవర్గ పరిశీలకుడు సుఖవాసి శ్రీనివాసరావుతో పాటు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు కూడా పాల్గొంటారని ఎంపీ కార్యాలయం జారీ చేసిన కార్యక్రమ పత్రంలో పేర్కొంది. అయితే తన ప్రమేయం లేకుండా ఏర్పాటు చేస్తున్న పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొనడానికి ఎమ్మెల్యే విముఖత చూపి వేరే కార్యక్రమాలు ఖరారు చేసుకున్నారని ఆయన వర్గీయులు తెలిపారు. ఈ కార్యక్రమం కోసం ఆహ్వానించడానికి వెళ్లిన నాయకులను సైతం ఎమ్మెల్యే పట్టించుకోలేదని సమాచారం. చివరికి ఎంపీ కేశినేని మాత్రమే కార్యాలయాన్ని ప్రారంభించారు. వారం రోజుల్లో తిరువూరు పట్టణంలోని వార్డుల్లో, రాజుగూడెం గ్రామంలో కూడా పార్టీలోని ఎంపీ, ఎమ్మెల్యే అనుచరుల మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. పార్టీ పరిశీలకుడు సుఖవాసి శ్రీనివాసరావు ఎంపీతో కలిసి కార్యక్రమాలకు హాజరవుతుండగా, ఎమ్మెల్యే గైర్హాజరుపై పార్టీ స్పందించకపోవడం చర్చనీయాంశమైంది. తన ప్రమేయం లేకుండానే తిరువూరు నియోజక వర్గంలోని పలు నామినేటెడ్‌ పదవులు, పార్టీ పదవులను కేటాయించడం కూడా ఎమ్మెల్యే అలకకు కారణంగా భావిస్తున్నారు.

ఎంపీ క్యాంపు కార్యాలయమేనా?

తిరువూరులో ఆదివారం ప్రారంభించిన టీడీపీ కార్యాలయం విజయవాడ ఎంపీ కేశినేని క్యాంపు కార్యాలయంగా ఉంటుందని పలువురు చెబుతున్నారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ఎంపీ కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నారని, ఈ కార్యాలయాల్లో ఎంపీ సిబ్బంది నాయకులు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటారని తెలిపారు.

తారస్థాయికి ఎంపీ వర్సెస్‌ తిరువూరు ఎమ్మెల్యే ఫైట్‌

టీడీపీ కార్యాలయ ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే కొలికపూడి డుమ్మా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement