మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): కృష్ణా విశ్వవిద్యాలయం అంతర్ కళాశాల ఆర్చరీ పోటీలు నగరంలోని శాతవాహన కళాశాల ఆవరణలోని మైదానంలో బుధవారం జరిగాయి. పలు కళాశాలల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. అనంతరం వర్సిటీ ఆర్చరీ టీమ్ సభ్యులను ఎంపిక చేశారు. బి.ప్రియవైష్ణవీ, జీవీ శాయి మునింధర్ రెడ్డి, ఎం.జయేంద్ర నాయుడు, వి.రాఘవకృష్ణ, వి.వంశీ, కె.భరత్‌కుమార్, వి.అనిల్‌కుమార్ కృష్ణా టీమ్‌కు ఎంపికయ్యారు. అక్టోబర్ 13 నుంచి 17వ తేదీ వరకు పంజాబ్‌లోని గురుకాశీ యూనివర్సిటీలో జరిగే ఆల్ ఇండియా ఆర్చరీ పోటీల్లో ఈ సభ్యులు కృష్ణా వర్సిటీ తరఫున పాల్గొంటారని పోటీల నిర్వాహకుడు బీహెచ్ సంగీతరావు చెప్పారు. ఎన్నికై న క్రీడాకారులను ఏపీ ఆర్చరీ అసోసియేషన్ చీఫ్ కోచ్ చెరుకూరి సత్యనారాయణ, కై కలూరులోని వైవీఎన్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ ఎం.శివనాగ రాజుతో పాటు శాతవాహన కళాశాల అధ్యాపకులు అభినందించారు.
పీహెచ్‌సీ వైద్యుల సమ్మె నోటీసు
లబ్బీపేట(విజయవాడతూర్పు): రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న వైద్యులు సమ్మెకు సిద్ధమవుతున్నారు. అందు లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు బుధవారం ఎన్టీఆర్ జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి డాక్టర్ మాచర్ల సుహాసినికి నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా వారి ప్రధాన డిమాండ్లను నోటీసులో పేర్కొన్నారు.
ఇన్–సర్వీస్ పీజీ కోటాను పునరుద్ధరించాలని, టైమ్–బౌండ్ ప్రమోషన్లు అమలు చేయాలని, గిరిజన ప్రాంతాల్లో పనిచేసే వారికి బేసిక్ పే 50% ట్రైబల్ అలవెన్స్ మంజూరు చేయాలని, నోషనల్ ఇన్‌క్రిమెంట్స్ ఇవ్వాలని, చంద్రన్న సంచార చికిత్స ప్రోగ్రామ్ కింద వైద్యులకు రూ. 5000 అలవెన్స్ చెల్లించాలని నోటీసులో పేర్కొన్నారు. నేటివిటీ – అర్బన్ ఎలిజిబిలిటీ సమస్యలను పరిష్కరించాలన్నారు. తమ నిరసన ప్రజలపై కాదని, ప్రభుత్వంపై మాత్రమేనని, కరోనా వంటి అత్యవసర పరిస్థితుల్లో పనిచేశామని, మా న్యాయమైన డిమాండ్‌లు పరిష్కరించాలని కోరారు.
నగరాల యువజన సంఘ రాష్ట్ర కార్యవర్గం ఎన్నిక
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నగరాల యువజన సంఘం నూతన కార్యవర్గం బుధవారం ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు గూడేల శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుడిగా గుడేల శ్రీనివాసరావు (దుబాయ్ శ్రీను), ప్రధాన కార్యదర్శిగా పిళ్లా ఆనందకుమార్ ఎన్నికై నట్లు పేర్కొన్నారు. అలాగే జిల్లా అధ్యక్షుడిగా అడ్డూరి జానకి మల్లేశ్వరరావు, కార్యదర్శిగా గూడేల అశోక్, నగర అధ్యక్షుడిగా తొత్తడి ఫణి తేజ్, కార్యదర్శిగా రాయన సునీల్ కుమార్‌లను నియమించామని తెలిపారు. నూతనంగా ఎన్నికై న కమిటీ అధ్యక్ష, కార్యదర్శులకు కన్వీనర్ శ్రీ తమ్మిన హరిబాబు, గౌరవ సలహాదారులు మజ్జి శ్రీనివాసరావు, కో కన్వీనర్లు మరుపిళ్ల దేవీప్రసాద్, పోతిన రమేష్, లీగల్ అడ్వైజర్ జగుపిళ్ల భాను ప్రతాప్ చేతుల మీదుగా నియామక పత్రాలు అందించినట్లు వివరించారు.

కృష్ణా వర్సిటీ ఆర్చరీ టీమ్ ఎంపిక