
అమెరికాలో వేమన శతకం బోధన
సత్తుపల్లిటౌన్: అమెరికాలోని తెలుగు కుటుంబాల్లో పిల్లలకు వేమన శతకపద్యాలు కూడా నేర్పుతున్నారు. డల్లాస్‌లోని కార్యసిద్ధి హనుమాన్ ఆలయంలో తెలుగు కుటుంబాల పిల్ల లకు ప్రతీ ఆదివారం బాల రామాయణం, బాలభారతం వంటి పురాణాలతో పాటు మాతృభాష నేర్పిస్తుండగా సత్తుపల్లికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు అయ్యదేవర శేషగిరిరావు – మాదిరాజు మాలతి దంపతులు ఇటీవల పరిశీలించారు. బోధన కోసం సృజన సాహితీ సమాఖ్య సమకూర్చిన వేమన శతకం పుస్తకాలతో పాటు ఊరిమెళ్ల సునంద రాసిన తెలుగు భాషా వాచకాలను శిక్షకురాలు దీప్తి శరణ్యకు అందించారు. ఈ కార్యక్రమంలో సాయిప్రకాష్ కౌశిక్ తదితరులు పాల్గొన్నాయి.
ఆర్టీసీ న్యాయవాదిగా
ఉబ్బన రామకృష్ణ
ఖమ్మంలీగల్/కల్లూరు: జిల్లా కోర్టులో గత 27ఏళ్లుగా న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్న కల్లూరుకు చెందిన ఉబ్బన రామకృష్ణ ఖమ్మం ఆర్టీసీ రీజియన్ స్టాండింగ్ న్యాయవాదిగా నియమితులయ్యారు. ఈమేరకు మంగళవారం ఆయనకు ఆర్‌ఎం సరిరామ్ నియామక ఉత్తర్వులు అందించారు. కాగా, రామకృష్ణను న్యాయవాది నిరంజన్‌రెడ్డి, ఏపీపీ శరత్‌కుమార్‌రెడ్డి, కల్లూరు వాసులు అభినందించారు.
పెన్షనర్లకు
బకాయిలు చెల్లించాలి
ఖమ్మం సహకారనగర్: ఉద్యోగ విరమణ చేసిన వారి బకాయిల చెల్లింపులో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ఇకనైనా విడనాడి నెలకు రూ. వేయి కోట్ల చొప్పున కేటాయించాలని పెన్షనర్ల సంఘం రాష్ట్ర కార్యదర్శి మేరి ఏసుపాదం డిమాండ్ చేశారు. ఖమ్మంలో సంఘం జిల్లా అధ్యక్షుడు పరిశ పుల్లయ్య అధ్యక్షతన మంగళవారం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. 2024 మార్చి నుండి ఉద్యోగ విరమణ చేసిన వారికి బకాయిలు అందకపోవడంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించాలని కోరారు. ఈసమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రాయల రవికుమార్‌తో పాటు గుర్రాల శ్రీనివాసరావు, ఊడుగు వెంకటేశ్వర్లు, తాడి అంజలి, లక్ష్మీ సుజాత, అన్నమ్మ, ప్రసాదరావు, సుధాకర్, కృష్ణారావు, వీరభద్రరావు పాల్గొన్నారు.
ఏఐ విజేతకు అభినందన
ఖమ్మంరూరల్: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ విభాగంలో ప్రతిభ కనబరిచి ఇటీవల ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా అవార్డు అందుకున్న మండలంలోని ఆరెంపులకు చెందిన తాళ్లూరిపల్లవిని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ అభినందించారు. ఆరెంపులలోని ఆమె ఇంటికి మంగళవారం వచ్చిన ఆయన పల్లవిని సన్మానించి మాట్లాడారు. ఈతరం యువతకు పల్లవి విజ యం స్ఫూర్తిగా నిలుస్తుందని తెలిపారు. అలాగే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద్రరావు ఫోన్‌లో పల్లవిని అభినందించారు.

అమెరికాలో వేమన శతకం బోధన

అమెరికాలో వేమన శతకం బోధన

అమెరికాలో వేమన శతకం బోధన