సర్వే నంబర్ల మాయాజాలం | - | Sakshi
Sakshi News home page

సర్వే నంబర్ల మాయాజాలం

Oct 9 2025 2:49 AM | Updated on Oct 9 2025 2:49 AM

సర్వే నంబర్ల మాయాజాలం

సర్వే నంబర్ల మాయాజాలం

అసైన్డ్‌ భూములకు పట్టా సర్వే నంబర్లు

ఆపై యథేచ్ఛగా రిజిస్ట్రేషన్లు

సత్తుపల్లి: అసైన్డ్‌ భూముల రిజిస్ట్రేషన్లలో అక్రమార్కుల లీలలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. సత్తుపల్లి రెవెన్యూ పరిధితో పాటు అయ్యగారిపేట రెవెన్యూలో పట్టా భూముల సర్వే నంబర్లను అసైన్డ్‌ భూములకు వేసి దర్జాగా రిజిస్ట్రేషన్లు చేయించడం వెనుక ఓ ముఠా ఉన్నట్లు తెలుస్తోంది. రిజిస్ట్రేషన్ల సమయాన అధికారులు పట్టా నంబర్లు ఉండడంతో చకచకా పని పూర్తిచేస్తున్నారు. అయితే, ఈ మా యాజాలంలో అధికారుల పాత్రపైనా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏదిఏమైనా అక్రమార్కుల తీరుతో అసైన్డ్‌, ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ నాయకులు వివాదాస్పద భూములను కొనుగోలు చేసి రికార్డుల్లో మార్పులు, చేర్పులు చేసి రిజిస్ట్రేషన్‌ చేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఒకే నంబర్‌ అన్నింటికీ..

సత్తుపల్లి రెవెన్యూ సర్వే నంబర్‌ 166లో పట్టా భూమి ఉంది. అయితే, చుట్టుపక్కల ఉన్న ప్రభు త్వ, అసైన్డ్‌ భూములకు సైతం ఇదే సర్వేనంబర్‌ వేసి రిజిస్ట్రేషన్‌ చేయిస్తున్నట్లు తెలిసింది. దీంతో సర్వే నంబర్‌లోని భూమి కంటే అధిక విస్తీర్ణం నమోదవుతుండగా.. భవిష్యత్‌లో వాస్తవ పట్టాదా రులకు ఇబ్బంది ఎదురయ్యే అవకాశముంది. ప్రభుత్వాలు దళితులు, బీసీలకు పంపిణీ చేసిన అసైన్డ్‌, ప్రభుత్వ వ్యవసాయ భూములను ప్లాట్లుగా మార్చి నట్లు సమాచారం. ఇందులో భాగంగానే అయ్యగారిపేటలోని సర్వే నంబర్‌ 38/ఊలో జొన్నలగడ్డ పున్నయ్యకు చెందిన అసైన్డ్‌ భూమిని సమీప వెంచర్‌ యజమానులు తప్పుడు సర్వే నంబర్‌తో ఆక్రమించినట్టు పున్నయ్య వారసుడు శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా అసైన్డ్‌ భూములను పట్టా భూములుగా మార్చడానికి మరో ఎత్తుగడ కూడా వేస్తున్నట్లు సమాచారం. ఏదైనా రెవె న్యూ పరిధిలో రైతుకు భూమి కన్నా రికార్డుల్లో అదనంగా నమోదై ఉంటే ఆ భూమిని రికార్డులో ఎక్కించి అదే సర్వే నంబర్‌తో క్రయవిక్రయాలు చేస్తున్నట్లు తెలిసింది.

గాడిదల వాగు అన్యాక్రాంతం

సత్తుపల్లి శివారు కాకర్లపల్లి రోడ్డులో గాడిదల వాగు అన్యాక్రాంతమవుతోంది. తామర చెరువు నుంచి అలుగు పోసుకొని గాడిదల వాగు మీదుగా ప్రవా హం వేశ్యకాంతల చెరువుకు వెళ్తుంది. దీనికోసం 40 మీటర్ల వరద కాలువను సైతం రైతులు స్వచ్ఛందంగా వదులుకున్నారు.

అయితే, ఇక్కడ బ్రిడ్జి చిన్నగా ఉండడంతో వర్షాకాలంలో తరచూ వరద పోటెత్తి రాకపోకలకు అంతరాయం ఏర్పడేది. దీంతో తుమ్మల నాగేశ్వరరావు ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఐదు కానాలతో హైలెవల్‌ బ్రిడ్జి నిర్మించారు. ఈ బ్రిడ్జి పక్కన ఉన్నవి పట్టా భూములు కావటంతో బ్రిడ్జి కానాలను మట్టితో పూడ్చేస్తున్నారు. ఒకవేళ పట్టా భూములైనా వ్యవసాయానికే ఉపయోగించాలని, ఎఫ్‌టీఎల్‌కు మించి భూములను మట్టితో చదును చేయడం చట్టవ్యతిరేకమని తెలిసినా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఫలితంగా హైలెవల్‌ బ్రిడ్జి నిర్మించినా రోడ్డుపైకి వరద చేరు తూ కాకర్లపల్లిరోడ్డు తదితర ప్రాంతాలు మళ్లీ ముంపునకు గురవుతున్నాయి. అలాగే, సత్తుపల్లి నలు దిక్కుల పూర్వకాలంలో ఉన్న నాలుగు నీటి కుంటలు సైతం అన్యాక్రాంతమైనట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement