ఖమ్మంమయూరిసెంటర్: బతుకమ్మ, దసరా సెలవుల్లో రీజియన్ వ్యాప్తంగా ఆర్టీసీ డీలక్స్, సూపర్‌లగ్జరీ, రాజధాని, లహరి బస్సుల్లో ప్రయాణించిన వారి నుంచి విజేతలను లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేశారు. ప్రయాణికులు తమ వివరాలతో టికెట్లను డిపోల వారీగా బాక్సుల్లో వేయగా ఏడు డిపోల టికెట్లను ఖమ్మం తీసుకొచ్చి కొత్త బస్టాండ్‌లో బుధవా రం డ్రా తీశారు. రీజినల్ మేనేజర్ సరిరామ్ ఆధ్వర్యాన జరిగిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాసరెడ్డి లక్కీ డ్రా ముగ్గురు విజేతలను ప్రకటించారు. ఖమ్మం డిపో నుంచి రాజధాని బస్సులో ప్రయాణించిన కాంతారావు, భద్రాచలం డిపో సూపర్‌లగ్జరీ బస్సులో ప్రయాణించిన సాయిబాబా, మణుగూరు డిపో నుంచి డీలక్స్ బస్సులో ప్రయాణించిన పి.సునీల్‌ను ఎంపిక చేయగా, వీరికి హైదరాబాద్‌లో బహుమతులను అందించనున్న ట్లు తెలిపారు. డిప్యూటీ ఆర్‌ఎం వి.మల్లయ్య, ఖమ్మం డిపో మేనేజర్ ఎం.శివప్రసాద్, సెక్యూరిటీ అధికారి కోటాజీ తదితరులు పాల్గొన్నారు.
డ్రా తీసిన అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి