
ముగిసిన శరన్నవరాత్రి ఉత్సవాలు
సాక్షి, పాడేరు: జిల్లా కేంద్రం పాడేరు మెయిన్‌బజార్‌లో శరన్నవరాత్రి ఉత్సవాలు శనివారం ఘనంగా ముగిశాయి. దీనిలో భాగంగా మధ్యాహ్నం ఆస్పత్రి సెంటర్‌లో భక్తుల సహకారంతో అన్నసమారాధన నిర్వహించారు. దుర్గమ్మ అనుపు ఉత్సవాన్ని ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సిండికేట్ వెంకటరమణ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. సాయంత్రం నుంచి రాత్రి వరకు పాడేరు పురవీధుల్లో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని తీన్‌మార్ డప్పు వాయిద్యాలు, థింసా,కోలాటం నృత్యాలతో ఊరేగించారు. అనంతరం స్థానిక చిలకలమామిడి గెడ్డలో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ గంగపూజారి శివ, ఉప సర్పంచ్ బూరెడ్డి రామునాయుడు, వర్తక సంఘ ప్రతినిధులు శివరాత్రి నాగేశ్వరరావు, బూరెడ్డి నాగేశ్వరరావు, ఇమ్మిడిశెట్టి అనిల్‌కుమార్, వెయ్యాకుల సత్యనారాయణ, శివరాత్రి శ్రీను, ముకుందరావు, పూసర్ల గోపి, ఉత్సవ కమిటీ ప్రతినిధులు కూడి చిట్టిబాబు, కోటపాడు శ్రీను, బోనంగి వెంకటరమణ, కూడి రాంనాయుడు, పచ్చా బుజ్జి, తాజుద్దీన్, బిక్కవోలు రవి పాల్గొన్నారు.
జిల్లా కేంద్రం పాడేరులో
భారీగా అన్నసమారాధన
ఘనంగా అమ్మవారి
ఉత్సవ విగ్రహ ఊరేగింపు
చిలకలమామిడి గెడ్డలో నిమజ్జనం

ముగిసిన శరన్నవరాత్రి ఉత్సవాలు