
టెట్‌పై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి
ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులను టెట్ పరీక్షలకు మినహాయించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. ఐదు సంవత్సరాలు పైబడి సర్వీస్ ఉన్న ఉపాధ్యాయులు తప్పనిసరిగా రెండేళ్లలో టెట్ పరీక్ష నుంచి అర్హత సాధించాలని, లేదంటే ఉద్యోగం నుంచి తప్పుకోవాలని సుప్రీంకోర్టు తీర్పు స్పష్టం చేయడంతో ఉపాధ్యాయ వర్గాలు ఆందోళనకు గురవుతున్నాయి. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం 2010 అక్టోబరు 23 కంటే ముందు నియమితులైన ఉపాధ్యాయులంతా కచ్చితంగా టెట్ అర్హత పరీక్ష ఉత్తీర్ణులు కావాల్సి ఉందన్నారు. దీనివల్ల ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న కొందరు ఉపాధ్యాయులు పదోన్నతలను, మరికొందరు పూర్తిగా ఉద్యోగాలను కోల్పోవాల్సి వస్తుంది. రెవెన్యూ, పోలీస్, వైద్యలు తదితర వృత్తుల్లో ఉన్నవారికి, ఉన్నతాధికారులకు లేని ఇన్ సర్వీస్ అర్హత ఉపాధ్యాయులకు మాత్రమే వర్తింపజేయడాన్ని తీవరంగా ఖండిస్తున్నాం.
–ఇమంది పైడిరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఎస్టీయూ