
మేలైన యాజమాన్యంతోఅధిక దిగుబడి
చింతపల్లి: గిరి రైతులు పసుపు, మిరియం పంటల్లో మేలైన యాజమాన్య పద్ధతులను పాటిస్తే మంచి దిగుబడులు సాదించవచ్చని జాతీయ సుగంధ ద్రవ్యాల బోర్డు మాస్టర్ ట్రైనర్ బి.శ్యాంసుందర్‌రెడ్డి సూచించారు. మంగళవారం ఎర్రబొమ్మలు పంచాయతీ సాడెకులో గిరిజన్ వికాస్ స్వచ్ఛంద సంస్థ, గంటన్నదొర రైతు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో సేంద్రియ వ్యవసాయ రైతులు తీసుకోవలలసిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు శాసీ్త్రయ పద్ధతులను పాటిస్తే పసుపు, మిరియంలో నాణ్యమైన దిగుబడులతో పాటు మార్కెటింగ్ అవకాశం ఉంటుందన్నారు. కాఫీలో బెర్రీబోరర్ కీటకం, కోత దశలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు,మార్కెట్ సదుపాయాలను గంటన్నదొర ఎఫ్‌పీవో సభ్యుడ సతీష్ కుమార్ వివరించారు.ఈ కార్యక్రమంలో మాతోట, గంటన్నదొర ఎఫ్‌పీవో సీఈవోలు వి.చిన్నారావు,లోవరాజు పాల్గొన్నారు.