
మానవ హక్కులపై అవగాహన కలిగి ఉండాలి
అడ్డతీగల : మానవ హక్కులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ సౌత్ ఇండియా జోనల్ ప్రెసిడెంట్ చల్లా రమేష్ అన్నారు. మంగళవారం స్థానిక ఆదివాసీ భవనంలో కమిషన్ రంపచోడవరం నియోజకవర్గ ఇన్‌చార్జ్ కోదండ వాసవి అధ్యక్షతన గిరిజనులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
గిరిజన సీ్త్రలు తమ హక్కులు తాము తెలుసుకోవాలన్నారు. ప్రత్యేక చట్టాల ద్వారా గిరిజనులకు అనేక హక్కులు సంక్రమించాయని వాటిని సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెందాలన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో ఎవరి హక్కులకు విఘాతం కలిగినా ప్రయోజనాలకు భంగం ఏర్పడినా తమను సంప్రదించాలని కోదండ వాసవి అన్నారు.యువతీ యువకులు మానవ హక్కులపై మరింత అవగాహన పెంపొందించుకుని గిరిజన ప్రాంత అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని కమీషన్ సౌత్ ఇండియా మెడికల్ సెల్ జోనల్ ప్రెశిడెంట్ ఆవాల వీరమోహన్ అన్నారు. కార్యక్రమంలో సంస్థ రాష్ట్ర నాయకులు బళ్లా మోహన్, జలారి వీరభద్రరావు, తమదాల కృష్ణారెడ్డి, పాల్గొన్నారు.