
క్రమశిక్షణతో కూడిన విద్య అవసరం
● కలెక్టర్ దినేష్‌కుమార్
పాడేరు : గిరిజన విద్యార్థులు ప్రాథమిక విద్య దశ నుంచి క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించి నిర్దేశించుకున్న లక్ష్యా న్ని సాధిందేలా తగిన తర్ఫీదు పొందాలని కలెక్టర్ దినేష్‌కుమార్ సూచించారు. మండలంలోని గుత్తులపుట్టు గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో సూపర్ ఫిఫ్టీ (టెన్త్) మూడో బ్యాచ్ శిక్షణ తరగతులను మంగళవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిష్ణాతులైన ఉపాధ్యాయులతో ఐటీడీఏ అందిస్తున్న ఈ ప్రత్యేక శిక్షణ తరగతులను టెన్త్ విద్యార్థులు పూర్తిగా సద్వినియోగం చేసుకుని టాపర్లుగా నిలవాలన్నారు. టెన్త్ పబ్లిక్ పరీక్షలకు ఇంకా ఆరు నెలలు మాత్రమే మిగిలి ఉందని ఇప్పటి నుంచి ప్రత్యేక ప్రణాళికతో చదువుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ, టీడబ్ల్యూ డీడీ పరిమళ, ఏటీడబ్ల్యూవో, పాఠశాల హెచ్‌ఎం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.