
వన్యప్రాణులనుసంరక్షించుకోవాలి
పెదబయలు: వన్యప్రాణులను సంరక్షించుకోవడం అందరి బాధ్యత అని పెదబయలు అటవీ శాఖ ఫారెస్టు అధికారి సుజనశ్రీ అన్నారు. బుధవారం మండలంలోని గోమంగి పంచాయతీ రాయిమామిడి గ్రామంలో వన్యప్రాణి వారోత్సవాల సందర్భంగా మానవ మనుగడ–జంతు సహజీవనం అనే అంశంపై అవగాహన కల్పించారు. అడవులు పెంచాలని, వన్యప్రాణులను రక్షించుకోవాలని, వాటిని వేటాడం చట్టరిత్యా నేరమని అన్నారు. వన్యప్రాణుల మనుగడ వల్ల మానవులకు మేలు జరుగుతుందన్నారు. వన్యప్రాణులను రక్షించుకుందామని నినాదాలు చేశారు. కార్యక్రమానికి ఎఫ్‌బీవోలు అనూష, రుక్మిణి. నీలకంఠం, గోమంగి మినీ గురుకులం ఉపాధ్యాయులు, గ్రామస్తులు కొంటా రామారావు పాల్గొన్నారు.