
మెనూ కచ్చితంగా అమలు చేయాలి
అడ్డతీగల : పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం మెనూ కచ్చితంగా అమలు చేయా లని విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బాలసుబ్రహ్మణ్యం అన్నారు. బుధవారం ఆయన అడ్డతీగల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం నిర్వహణను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థుల కోసం తయారు చేసిన అహారాన్ని తీసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. ఎప్పటికప్పుడు మధ్యాహ్న భోజనం నిర్వహణ తీరుని స్థానిక అధికారులు పర్యవేక్షిస్తూ ఉండాలని ఆదేశించారు. అనంతరం ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఎంఈఓ–1 కె.రమేష్, ఎంఈఓ–2 పి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.