
మాచ్‌ఖండ్‌లో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేత
ముంచంగిపుట్టు: ఆంధ్ర ఒడిశా రాష్ట్రాల ఉమ్మడి నిర్వహణలో ఉన్న మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రంలో బుధవారం విద్యుత్ ఉత్పత్తి నిలిపివేశారు. ఇక్కడి నుంచి ఒడిశా రైల్వే ఫీడర్ లైన్ల పునరుద్ధరణకు నిలిపివేసినట్లు ప్రాజెక్టు ఎస్‌ఈ ఏవీ సుబ్రమణ్యేశ్వరరావు తెలిపారు. ఒడిశా రైల్వే ఫీడర్‌లో సాంకేతిక లోపాలను సరిచేసి ఫీడర్‌లైన్ల పునరుద్ధరణకు ఒడిశా విద్యుత్ సరఫరా శాఖ(ఓపీటీసీఎల్) అధికారులు కోరిన మేరకు ఉత్పాదన నిలిపివేశామన్నారు. ఈ ఫీడర్‌ను అనుసంధానం చేయడం వల్ల మాచ్‌ఖండ్ విద్యుత్ లంతాపుట్టు సమితి మీదుగా ఒడిశాకు చేరునున్నట్లు ఒడిశా విద్యుత్‌శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయడంతో గంటకు 102 మెగావాట్లు ఉత్పత్తిపై ప్రభావం చూపింది. ప్రాజెక్టు నుంచి విద్యుత్ సరఫరా లేకపోవడం వల్ల ఒనకఢిల్లీ, మాచ్‌ఖండ్, జోలాపుట్టు గ్రామాలతో పాటు పరిసర గ్రామాలు అంధకారంలో ఉన్నాయి.
● ఒడిశా రైల్వే ఫీడర్ లైన్ల పునరుద్ధరణకు అంతరాయం
● ప్రాజెక్టు ఎస్‌ఈ ఏవీ సుబ్రమణ్యేశ్వరరావు