
పిడుగుపాటుకు వ్యక్తి మృతి
చింతపల్లి : మండలంలో పిడుగుపాటుకు వ్యక్తి మృతి చెందిన ఘటన బెన్నవరం పంచాయతీ చిన కొత్తపాలెంలో బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. నాతవరం మండలం మన్యపురట్ల గ్రామానికి చెందిన ముత్తా రమణ (54) ఏజెన్సీలో వ్యాపార నిమిత్తం తరచూ వస్తుంటాడు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం స్వగ్రామం మన్యపురట్ల నుంచి మండలంలోని చినకొత్తపాలెం గ్రామానికి వచ్చాడు. తిరుగు ప్రయాణంలో వర్షం పడుతుండగా చెట్టు కింద ఆగాడు. అదే సమయంలో చెట్టుపై పిడుగు పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.