
కళావేదికపునర్నిర్మాణానికి వినతి
చింతపల్లి: తాజంగి పంచాయతీ కేంద్రంలో శిథిలావస్థకు చేరిన కళావేదికను పునర్నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని మిషన్ తాజంగి అధ్యక్షుడు శెట్టి శంకరరావు తదతరులు బుధవారం ఎంపీపీ కోరాబు అనూషదేవికి వినతి పత్రాన్ని అందజేశారు. కళావేదిక పరిస్థితిని వివరించారు. ఈ కళాక్షేత్రం ద్వారా సభలు, సమావేశాలు, సాంస్కృతిక తదితర కార్యక్రమాల ఏర్పాటుకు ఎంతో అనువుగా ఉండేదని, ప్రస్తుతం శిథిలస్థితికి చేరుకోవడంతో ఇబ్బందులు పడుతున్నట్టు తెలిపారు. దీనిపై ఎంపీపీ అనూషదేవి స్పందించి కళావేదిక పునర్నిర్మాణానికి నిధుల మంజూరుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. మిషన్ తాజంగి సభ్యులు పాల్గొన్నారు.