breaking news
War hero
-
వీరమాతకు వందనం
యుద్ధంలో బిడ్డను కోల్పోయిన దుఃఖం ఒకవైపు. ‘దేశమాత కోసం నా బిడ్డప్రాణత్యాగం చేశాడు’... అనే గర్వం ఒకవైపు... ఎంతోమంది వీరమాతలు... అందరికీ వందనం...యుద్ధ చరిత్రలోకి ఒకసారి...గర్వంగా అనిపించింది...కొన్ని సంవత్సరాల క్రితం... ఉగ్రవాదులతో జరిగిన పోరులో నలుగురిని చంపేశాడు లెఫ్టినెంట్ నవదీప్‌సింగ్. ఉగ్రవాదులతో వీరోచితంగా పోరాడుతూనే నేలకొరిగాడు 26 సంవత్సరాల ఆ యువకుడు. ‘నేనంటే నవదీప్‌కు ఎంత ఇష్టమో చెప్పడానికి మాటలు చాలవు. ఫ్రెండులా ఎన్నో కబుర్లు చెబుతుండేవాడు. నవదీప్ లేడు అనే వాస్తవం జీర్ణించుకోవడం కష్టంగా ఉంది. ఇప్పటికీ కలలో ఏదో ఒక రూపంలో పలకరిస్తూనే ఉంటాడు. అమ్మా...నేను వస్తున్నాను అనే మాట వినబడితే సంతోషంగా అనిపించేది. లెఫ్టినెంట్ నవదీప్‌సింగ్ తల్లి కౌర్ ఇక ఆ మాట ఎప్పుడూ వినిపించదు. ఉగ్రవాదులను నవదీప్ దీటుగా ఎదుర్కోకపోతే ఎంతో నష్టం జరిగి ఉండేది... అని పై అధికారులు చెప్పినప్పుడు ఎంతో గర్వంగా అనిపించింది. నవదీప్ నా బిడ్డ. అతడు చనిపోయినప్పుడు నేనే కాదు.. ఎంతోమంది తల్లులు సొంత బిడ్డను కోల్పోయినట్లు ఏడ్చారు. ఆ దృశ్యం ఇప్పటికీ నా కళ్లముందే ఉంది. దేశం కోసం పోరాడే వీరసైనికుడికి ఒక్కరే అమ్మ ఉండదు. దేశంలోని ప్రతి అమ్మ తన అమ్మే’ అంటుంది పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌కు చెందిన నవదీప్‌సింగ్ తల్లి కౌర్.ఇంటికి ఎప్పుడొస్తావు బిడ్డ?ఆంధ్రప్రదేశ్‌లోని పెనుగొండ నియోజక వర్గం కల్లితండాకు చెందిన ఆర్మీ జవాన్ మురళీనాయక్ పాక్‌తో జరిగిన యుద్ధంలో చనిపోయాడు. ఆ తల్లి దుఃఖ భాషను అర్థం చేసుకోగలమా? కుమారుడు మురళీనాయక్ మరణం గురించి అడిగినప్పుడు ‘ఏమని చెప్పాలి సామీ’ అని ఆ తల్లి భోరున విలపించింది. మురళీనాయక్ పార్థివదేహాన్ని చూడడానికి ఎక్కడెక్కడి నుంచో జనాలు తరలి వచ్చారు. వారు తనలాగే ఏడ్చారు. అమ్మా... నీ కొడుకు ఎంత గొప్ప వీరుడో చూశావా! ‘ఆర్మీ జవాన్ మురళీ నాయక్ తల్లి’ అని తనను పరిచయం చేస్తున్న సమయంలో ఆ తల్లి హృదయం గర్వంతో పొంగిపోతుంది. మాతృదినోత్సవం సందర్భంగా ఆ వీరమాతలందరికీ వందనం.కవాతు శబ్దాలు వినిపిస్తూనే ఉంటాయి!జమ్మూ కశ్మీర్ దోడాలో జరిగిన ఎన్కౌంటర్లో కెప్టెన్ బ్రిజేష్ థాప వీరమరణం పొందాడు. ‘బ్రిజేష్ ఇక లేడు అనే వార్త విని కుప్పకూలిపోయాను. మా అబ్బాయి అని చెప్పడం కాదుగానీ చాలా క్రమశిక్షణ ఉన్న కుర్రాడు. ఇంజినీరింగ్ చదివే రోజుల్లోనే నేను సైన్యంలో చేరుతాను అనేవాడు. సైన్యంలో పనిచేయడం చాలా కష్టం అని చెబుతుండేదాన్ని. ఎంత కష్టమైనా సైన్యంలోకి వెళతాను అనేవాడు. బ్రిజేష్ లేడనే వాస్తవం కష్టంగా ఉన్నా సరే... దేశం కోసం నా కుమారుడుప్రాణాలు అర్పించాడు అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది’ అంటారు నీలిమ థాప. సైనిక దుస్తుల్లో కుమారుడిని చూసిన తొలి క్షణం నీలిమ భావోద్వేగానికి గురయ్యారు.ఎప్పటి కల అది! నాన్న యూనిఫామ్ వేసుకొని చిన్నారి బ్రిజేష్ మార్చ్ చేస్తుండేవాడు (బ్రిజేష్ తండ్రి మిలిటరీలో పనిచేశారు) కుమారుడిని చూసి ‘మేజర్ సాబ్ వచ్చేశారు’ అని నవ్వేది.ఇప్పుడిక ఆమెకు నవ్వే అవకాశమే లేకపోవచ్చు. కన్నీటి సముద్రంలో దిక్కుతోచకుండా ఉన్నట్లుగానే ఉండవచ్చు. అయితే... కుమారుడి ధైర్యసాహసాల గురించి విన్నప్పుడు ఆ తల్లి హృదయం గర్వంతో ఉప్పొంగుతుంది. ‘కెప్టెన్ బ్రిజేష్ థాప’ అని కుమారుడి పేరు విన్నప్పుడల్లా... ఆర్మీ అధికారుల కవాతు శబ్దాలు ఆమెకు వినిపిస్తూనే ఉంటాయి.ఆ తల్లి ఎలా తట్టుకుందో!‘పిల్లల పెంపకంలో తల్లి పాత్ర కీలకం’ అంటుంది తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేటకు చెందిన మంజుల. ఇండియా–చైనా యుద్ధంలో ఆమె కుమారుడు కల్నల్ సంతోష్‌బాబు కన్నుమూశాడు. చదువులోనే కాదు ఆటల్లో, సాంస్కృతిక కార్యక్రమాల్లో ముందుండే కొడుకును చూసి మంజుల గర్వించేది. ఆరోజు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో సంతోష్ మరణం గురించి మంజులకు తెలియజేశారు. ఆ తల్లి గుండె ఎలా తట్టుకుందో తెలియదు. కల్నల్ సంతోష్ బాబు, తల్లి మంజులకుమారుడి బాల్యవిశేషాలు, క్రమశిక్షణ గురించి కళ్లకు కట్టినట్లు చెప్పే మంజుల కుమారుడి మరణం గురించి.. ‘మన దేశం కోసం మా అబ్బాయి వీరమరణం పొందాడు’ అని గర్వంతో చెబుతుంది. ‘ఒక్కడే బాబు నాకు...’ అంటున్న ఆ తల్లి కంఠానికి కన్నీళ్లు అడ్డుపడి మాటలు రావు. ఆమె మనసులో కనిపించని దుఃఖసముద్రాలు ఉండవచ్చుగాక... కానీ ఆమె పదే పదే చెబుతుంది...‘నా బిడ్డ మన దేశం కోసం చనిపోయాడు’.ఎక్కడ ఉన్నా అమ్మ గురించే‘కెప్టెన్ సౌరభ్ కాలియ బయట ఎలా ఉంటాడో తెలియదుగానీ ఇంట్లో మాత్రం చిలిపి’ అంటుంది అతడి తల్లి విజయ కాలియ. ‘మేరా పాస్ మా హై’ అని తల్లి గురించి సరదాగానే సినిమా డైలాగు చెబుతుండేవాడుగానీ... నిజంగా తల్లి సౌరభ్ ధైర్యం. సైన్యం. ‘ఒకరోజు సౌరభ్ వంటగదిలోకి వచ్చి సైన్ చేసిన బ్లాంక్ చెక్ ఇచ్చాడు. ఎందుకు? అని అడిగితే ‘నేను ఫీల్డ్‌లో ఉన్నప్పుడు మనీ విత్‌డ్రా చేసుకోవడానికి’ అన్నాడు. తాను ఎక్కడ ఉన్నా నా గురించే ఆలోచించేవాడు’ అంటుంది విజయ.ఇప్పుడు ‘కాలియ హోమ్’లో ఆ బ్లాంక్ చెక్ కనిపిస్తూనే ఉంటుంది. ఆ చెక్‌ను చూసినప్పుడల్లా కుమారుడిని చూసినట్లుగానే ఉంటుంది. ‘డబ్బును డ్రా చేసుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు ఈ కాగితంపై నా బిడ్డ చేసిన సంతకం ఉంది. అది నాకోసం చేసింది. ఇది ఎప్పటికీ తీయటి జ్ఞాపకంగా ఉండిపోతుంది’ అంటుంది విజయ. చివరిసారిగా తమ్ముడి పుట్టిన రోజు సందర్భంగా ఇంటికి ఫోన్ చేశాడు సౌరభ్.‘నా పుట్టిన రోజుకు తప్పకుండా ఇంటికి వస్తాను అన్నాడు. ఆ రోజు ఇప్పటికీ రాలేదు’ అని కళ్లనీళ్ల పర్యంతం అవుతుంది విజయ. 23 ఏళ్లు నిండకుండానే కార్గిల్ యుద్ధంలో సౌరభ్ చనిపోయాడు. హిమాచల్‌ద్రేశ్‌లోని పలంపూర్ ఇంట్లో ఒక గది మొత్తాన్ని సౌరభ్ మ్యూజియంగా మార్చారు. ‘ఈ మ్యూజియంలోకి వస్తే మా అబ్బాయి దగ్గరకి వచ్చినట్లే ఉంటుంది’ అంటుంది విజయ.నా కుమారుడు... వీరుడుఆ అమ్మ పేరు త్రిప్తా థాపర్... ఆమె కళ్లలో ఒకవైపు అంతులేని దుఃఖం, మరోవైపు గర్వం కనిపిస్తాయి. కార్గిల్ యుద్ధంలో థాపర్ తన కుమారుడిని కోల్పోయింది. మధ్యప్రదేశ్‌లో మహు పట్టణంలోని మిలిటరీ కంటోన్మెంట్ మ్యూజియంలో కార్గిల్ యుద్ధ దృశ్యాలను, కుమారుడి ఫోటోను చూస్తున్నప్పుడు ఆమెకు దుఃఖం ఆగలేదు.ఇరవై రెండు సంవత్సరాల వయసులో దేశం కోసం ప్రాణాలు అర్పించిన విజయంత్ థాపర్ కార్గిల్ వార్ హీరో. తన దళంతో శత్రువుల బంకర్ ను చుట్టుముట్టే క్రమంలో విజయంత్ థాపర్ మరణించాడు.వీర్‌చక్ర విజయంత్ థాపర్ ,తల్లి త్రిప్తా థాపర్ ‘వీర్‌చక్ర విజయంత్ థాపర్ అమ్మగారు అని నన్ను పరిచయం చేస్తుంటారు. వీర్‌చక్ర అతడి పేరులో శాశ్వతంగా కలిసిపోయింది’ అని విజయంత్ గురించి గర్వంగా చెబుతుంది త్రిప్తా థాపర్. ఆమె దృష్టిలో అది మ్యూజియం కాదు. పవిత్ర స్థలం. ‘ఈ మ్యూజియంలో ఉన్న ప్రతి వస్తువు, ప్రతి ఫోటో ఎన్నో జ్ఞాపకాలను కళ్ల ముందు ఆవిష్కరిస్తుంది. దేశం కోసం చిన్న వయసులోనే జీవితాన్ని త్యాగం చేసిన వీరులను పదే పదే తలుచుకునేలా చేస్తుంది’ అంటుంది థాపర్. తన సన్నిహిత మిత్రురాలు పూనమ్ సైనీతో కలిసి తరచు ఈ మ్యూజియమ్‌కు వస్తుంటుంది త్రిప్తా థాపర్.ఎప్పుడు వచ్చినా కుమారుడి దగ్గరికి వచ్చినట్లే ఉంటుంది ఆ తల్లికి. బ్యాగులు సర్దుకొని ఇల్లు వదిలే ముందు... ‘అమ్మా... ఆరోగ్యం జాగ్రత్త’ అని చెప్పేవాడు. గంభీరంగా కనిపించే అతడి కళ్లలో అమ్మను విడిచి వెళ్లే ముందు సన్నని కన్నీటి పొర కనిపించేది. అయితే అమ్మకు ఆ కన్నీటి ఆనవాలు కనిపించకుండా తన చిరునవ్వు చాటున దాచేవాడు. ‘అమ్మా, కొడుకుల అనుబంధం గురించి చెప్పడానికి మాటలు చాలవు’ అని కన్నీళ్లు తుడుచుకుంటుంది త్రిప్తా థాపర్ స్నేహితురాలు పూనమ్. -
చైనా అధ్యక్షుడి పై విమర్శలు... కలకలం రేపుతున్న లేఖ!
Covid diagnosis and treatment plan is violated: కరోనా పుట్టినిల్లు అయినా చైనా ఆది నుంచి జీరో కోవిడ్ పాలసీ విధానం అంటూ గొప్పలు చెప్పుకుంది. ఎంత కఠినతరమైన ఆంక్షలు విధించినా కరోనా కేసులు పెరుగుతూ.. ఊహించని ఝలక్ ఇస్తూనే ఉంది ఈ కోవిడ్ మహమ్మారి. దీంతో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ జీరో కోవిడ్ పాలసీ విధానాన్ని డబుల్ చేస్తానంటూ ప్రకటించాడు. వృద్ధులు, చిన్నారులు పరిస్థితి ఆందోళనకరంగా ఉంది ఈ విధానం వద్దని చైనా అధికారులు చెబుతున్నా వినకుండా నియంతలా వ్యవహరించాడు జిన్‌పింగ్. మరోవైపు ప్రపంచ దేశాల నుంచి కూడా చైనా పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి . ఈ నేపథ్యంలో చైనా యుద్ధ వీరుడు, జనరల్ లువో రుయికింగ్ కుమార్తె లువో డయాండియన్ కరోనా మహమ్మారి విషయంలో చైనా అనుసరిస్తున్న విధానాన్ని తప్పుబడుతూ రాసిన లేఖ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఆ లేఖలో ఆమె చైనా అధ్యక్షుడి పేరు ఎత్తకుండా ఆయన తీసుకుంటున్న నిర్ణయాల పై పరోక్షంగా ఆరోపణలు చేసింది. ఐసోలేషన్ అంటూ జనాలను బంధిస్తూ చైనా ప్రభుత్వం తనకు తెలియకుండానే కరోనా వచ్చిన వారిని, రానివారిని కూడా బంధీలుగా మార్చింది. దీని వల్ల ప్రజల మానసిక స్థితి దెబ్బతింటుందన్న ఇంగిత జ్ఞానం కూడా లేదంటూ తిట్టిపోసింది. బాధ్యతరాహిత్యంగా ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేస్తూ ఆరోగ్య కార్యకర్తలను అధికారులను ఇబ్బందులకు గురి చేసిందని విమర్శించింది. ఇలాంటి విపత్కర సమయంలో పాటించాల్సిన కనీస ప్రాథమిక విధానాలను కూడా ఉల్లంఘించిందంటూ ఘాటు విమర్శలు చేసింది. ఇది ప్రజల నిత్య జీవన విధానానికి విఘాతం కలిగించేలా తప్పుడూ విధానాన్ని అనుసరించిందని చెప్పింది. ఇంత అన్యాయం జరుగుతున్న అధికారంలో ఉన్నవారెవరు నోరెత్తకపోవడం విచిత్రం అంటూ చైనా తీరుని నిందిస్తూ రాసింది. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. (చదవండి: విజృంభిస్తున్న కేసులు... జీరో కోవిడ్ పాలసీని వదలనంటున్న చైనా!) -
లెజండరీ ఘోస్ట్ ఆఫ్ కీవ్ మృతి
అతనుయుద్ధం మొదలైన తొలిరోజే ఆరు రష్యా యుద్ధ విమానాలను కూల్చేసి గార్డియన్ ఏంజెల్‌గా ప్రశంసలు అందుకున్నాడు. వైమానిక దాడులతో రెచ్చిపోతున్న రష్యాకి దడ పుట్టేలా చేశాడు. ఎవరా పైలెట్ ఫైటర్ అని రష్యా బలగాల్లో ఒకటే ఉత్కంఠ. రష్యా బలగాలకు నిద్రపట్టకుండా చేసి సుమారు 40 యుద్ధ విమానాలకు కూల్చేశాడు ఉక్రెయిన్‌లో ఘొస్ట్ ఆఫ్ కీవ్‌గా పిలిచే యుద్ధ వీరుడు. రష్యా బలగాలను మట్టికరింపించేలా చివరి శ్వాస వరకు పోరాడాడు. war hero dies in battle after shooting down 40 Russian aircraft: ఘోస్ట్ ఆఫ్ కీవ్‌గా పిలిచే 29 ఏళ్ల స్టెపాన్ తారాబల్కా అనే ఉక్రెనియన్ ఫైటర్ పైలెట్ గత నెలలో జరిగిన యుద్ధంలో మరణించాడని వైమానికదళ అధికారులు వెల్లడించారు. అతను మిగ్ 29 ఫైలెట్లో వెళ్తున్నప్పుడూ శత్రుదళాలు జరిపిన కాల్పులో మరణించాడని తెలిపారు. అతను యుద్ధం మొదలైన తొలరోజునే ఆరు రష్యా యుద్ధ విమానాలను కూల్చి వేశాడని చెప్పారు. దీంతో అతన్ని ఉక్రెనియన్లు గార్డియన్ ఏంజెల్‌గా ప్రశంసించారు. అంతేకాదు తారాబల్కా ఘోస్ట్ ఆఫ్ కీవ్‌గా యుద్ధంలో రహస్య ఆపరేషన్లు చేపట్టి దాడులు చేస్తుంటాడని తెలిపారు. అంతేకాదు యుద్ధంలో ఇప్పటివరకు సుమారు 40 రష్యా యుద్ధ విమానాలను కూల్చాడు. దీంతో రష్యా బలగాలకు నిద్రపట్టకుండా చేసే ఒక భయంకరమైన వ్యక్తిగా మారాడు. తారాబాల్కకు మరణానంతరం యుద్ధంలో కనబర్చిన ధైర్యసాహసాలకు ఇచ్చే ఉక్రెయిన్ అత్యుత్తమ పతకం ఆర్డర్ ఆఫ్ ది గోల్డెన్ స్టార్, హీరో ఆఫ్ ఉక్రెయిన్ అనే బిరుదును అందించారు. అతనికి భార్య ఒలేనియా, ఎనిమిదేళ్ల కుమారుడు యారిక్ ఉన్నారు. తారాబల్కా పశ్చిమ ఉక్రెయిన్‌లోని కొరోలివ్కా అనే చిన్న గ్రామంలోని శ్రామిక కుటుంబంలో జన్మించారు. అతను చిన్నప్పుడూ తన గ్రామం మీదుగా ఆకాశంలో ఎగురుతున్న ఫైటర్ జెట్లు పైలట్ కావాలనుకునేవాడు. మరోవైపు ఉక్రెయిన్ ప్రభుత్వం తారాబల్కా మరణం గురించి ఎలాంటి సమంచారం ఇవ్వదని తల్లిదండ్రులు చెబుతుండటం గమనార్హం. ఉక్రెయిన్ ధైర్య సాహసాలు ప్రంపంచానికి అవగతమయ్యేలా వీరోచితంగా పోరాడి గొప్ప వీర మరణం పొందాడు. తారాబల్కా మరణించినా అతని ధైర్య సాహసాలు మాత్రం చిరస్థాయిగా నిలిచిపోతాయి. (చదవండి: రష్యా బలగాలు నాడు మా దాకా వచ్చాయి.. టైమ్ మ్యాగజైన్‌పై జెలెన్స్కీ) -
సెనెటర్ మెక్కెయిన్ కన్నుమూత
న్యూయార్క్: అమెరికా ప్రఖ్యాత రాజకీయవేత్త, ట్రంప్ బద్ద్ధ విరోధి, భారత్‌కు మంచి మిత్రుడిగా పేరుపడ్డ సెనెటర్ జాన్ మెక్కెయిన్(81) అనారోగ్యంతో కన్నుమూశారు. వియత్నాం యుద్ధ హీరోగా అమెరికన్ల మనసు గెలుచుకున్న ఆయన బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతూ శనివారం సాయంత్రం 4.28 గంటలకు(భారత కాలమానం ఆదివారం తెల్లవారుజామున) తుదిశ్వాస విడిచారు. మెక్కెయిన్ కోరిక మేరకు వైద్య సేవలు నిలిపివేసినట్లు ఆయన కుటుంబం శుక్రవారమే ప్రకటించింది. అరిజోనా రాష్ట్రం నుంచి ఆరుసార్లు సెనెటర్ పనిచేసిన కెయిన్‌కు క్యాన్సర్ ఉన్నట్లు 2017లో బయటపడింది. అప్పటి నుంచి రేడియేషన్, కీమోథెరపీ తీసుకుంటున్నా ఆరోగ్యం పూర్తి క్షీణించడంతో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. ‘నా హృదయం బద్ధలైంది. 38 సంవత్సరాలు ఈ అద్భుతమైన వ్యక్తితో ప్రేమ ప్రయాణం చేసినందుకు నేను ఎంతో అదృష్టవంతురాలిని. బతికున్నంత కాలం నచ్చినట్లుగానే జీవించారు. మరణం కూడా అంతే.. ఆయనను ప్రేమించినవారు చుట్టుఉండగా.. తాను ఎంతో ఇష్టపడిన చోటే ప్రాణాలు వదిలారు’ అని మెక్కెయిన్ భార్య సిండీ ట్విట్టర్లో తెలిపారు. వియత్నాం యుద్ధంలో నేవల్ అధికారిగా పనిచేసిన కెయిన్ దాదాపు ఐదేళ్లు శత్రువు చేతిలో చిత్రహింసలు అనుభవించారు. అయినా అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించి ప్రాణాలతో బయటపడి అమెరికన్ల ప్రశంసలు అందుకున్నారు. సెనేట్ ఆర్మ్డ్ సర్వీసెస్ కమిటీ చైర్మన్‌గా పనిచేసిన కెయిన్ రెండు సార్లు అమెరికా అధ్యక్ష పదవి కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. 2000లో రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి పోరులో జార్జి బుష్ చేతిలో ఓడిపోగా.. 2008 రిపబ్లికన్ అభ్యర్థిగా ఎంపికైనా అధ్యక్ష ఎన్నికల్లో ఒబామా చేతిలో ఓడిపోయారు. అంత్యక్రియలకు ట్రంప్ రావద్దు రిపబ్లికన్ సెనేటర్‌గా ఉన్నప్పటికీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిరంకుశ నిర్ణయాల్ని ఎండగట్టడంలో మెక్కెయిన్ ఎప్పుడూ ముందుండేవారు. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రెచ్చగొట్టే ప్రకటనల్ని తీవ్రంగా విమర్శించారు. శరణార్థుల విషయంలో అమెరికా విధానాల్ని తూర్పారపడుతూ ట్రంప్‌కు పక్కలో బల్లెంలా మారారు. తన అంత్యక్రియలకు సైతం రావద్దని ట్రంప్‌కు తన వైఖరిని స్పష్టం చేశారు. అంత్యక్రియలకు ట్రంప్‌ను ఆహ్వానించడం లేదని ఇప్పటికే కెయిన్ కుటుంబం ప్రకటించింది. మెక్కెయిన్ మృతి పట్ల పార్టీల కతీతంగా సంతాపం వెల్లువెత్తింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా, జార్జి బుష్ తదితరులు సంతాపం తెలిపిన వారిలో ఉన్నారు. మెక్కెయిన్ మృతికి భారత ప్రధాని మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. భారత్‌తో స్నేహానికి పెద్దపీట భారత్‌తో స్నేహ సంబంధాల్ని కాంక్షించడంలో ఆయన ఎప్పుడూ ముందుండేవారు. 2016లో ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా సీఎన్ఎన్కు సంపాదకీయం రాస్తూ.. ‘ఈ పర్యటన ఎప్పటికీ గుర్తుండిపోతుంది. పార్టీలకతీతంగా అమెరికా–భారత్ సంబంధాలకు పెద్ద ఎత్తున మద్దతు లభించింది. నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏవో కొన్ని దేశాలకు మాత్రమే ఇంత తక్కువ కాలంలో గొప్ప గౌరవం లభించింది. భారత్‌తో సంబంధాలు అమెరికాకు ఎంత ముఖ్యమో మోదీ పర్యటన చాటిచెప్పింది’ అని ప్రస్తుతించారు. అమెరికాలో భారత కంపెనీల పెట్టుబడులు వేగంగా పెరుగుతున్నాయని, ఉద్యోగ కల్పనలో అవి తమ వంతు పాత్ర పోషిస్తున్నాయని ప్రశంసించారు. -
అర్జన్ సింగ్‌కు కన్నీటి వీడ్కోలు
► యుద్ధ విమానాలతో ‘ఫ్లై పాస్ట్’ ► అధికార లాంఛనాలతో అంత్యక్రియలు న్యూఢిల్లీ: యుద్ధ వీరుడు, మార్షల్ ఆఫ్ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అర్జన్ సింగ్(98)కు జాతి కన్నీటి వీడ్కోలు పలికింది. కంటోన్మెంట్ ప్రాంతంలోని బ్రార్ స్క్వేర్ శ్మశానవాటికలో సోమవారం సిక్కు సంప్రదాయం ప్రకారం, ప్రభుత్వ లాంఛనాలతో ఆయన పార్థివ దేహానికి అంతిమ సంస్కారాలు జరిగాయి. అర్జన్ సింగ్ కుమారుడు అరవింద్ ఆయన భౌతికకాయానికి తలకొరివి పెట్టారు. ఈ సందర్భంగా దేశ రాజధానిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాను అవనతం చేశారు. రాజకీయ ప్రముఖులు, ఆర్మీ ఉన్నతాధికారులు హాజరయ్యారు. గుండెపోటుతో శనివారం తుది శ్వాస విడిచిన అర్జన్‌సింగ్ భౌతిక కాయానికి తొలుత 17 తుపాకులతో సైనికులు గౌరవ వందనం సమర్పించారు. యుద్ధ వీరుడికి గౌరవ సూచకంగా ‘మిస్సింగ్ మ్యాన్ ఫార్మేషన్’లో ఐఏఎఫ్ సుఖోయ్ ఎస్‌యూ–30 యుద్ధ విమానాలు గగనతలంలో సైనిక విన్యాసాలు (ఫ్లై పాస్ట్)నిర్వహించాయి. ఐఏఎఫ్ ఎంఐ–17 వీ5 హెలికాప్టర్లు కూడా అర్జన్ సింగ్‌కు నివాళిగా వీఐసీ ఆకారంలో విన్యాసాలు నిర్వహించాయి. అమరుడైన సైనికాధికారి గౌరవార్థం ఆకాశంలో యుద్ధ విమానాలతో నిర్వహించేదే ‘మిస్సింగ్ మ్యాన్ ఫార్మేషన్’. అంతకుముందు జాతీయ పతాకం కప్పిన సింగ్ పార్థివ దేహాన్ని ఢిల్లీలోని ఆయన నివాసం నుంచి మిలిటరీ వాహనంలో బ్రార్ స్క్వేర్‌కు తరలించారు. రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, మాజీ ప్రధాని మన్మోహన్సింగ్, బీజేపీ అగ్రనేత ఎల్కే అడ్వాణీ తదితరులతో పాటు త్రివిధ దళాల ప్రస్తుత, మాజీ అధిపతులు, సింగ్ కుటుంబ సభ్యులు సైనిక వీరుడికి కడసారి నివాళులర్పించారు. ధీశాలి.. తిరుగులేని పైలట్... వాయుసేనలో ఫైవ్‌స్టార్ ర్యాంక్ పొందిన ఏకైక అధికారి అర్జన్‌సింగ్ 1965 భారత్–పాక్ యుద్ధంలో వీరోచిత పాత్ర పోషించారు. చిన్న వయసులోనే యుద్ధంలో వైమానిక దళాన్ని ముందుండి నడిపించిన ఆయన సేవలను పలువురు కీర్తించారు. నాడు అమెరికా మద్దతు కలిగిన వైమానిక దళాలున్న పాక్‌ను సింగ్ నేతృత్వంలోని ఐఏఎఫ్ తరిమికొట్టిందని మాజీ ఎయిర్ వైస్ మార్షల్ కపిల్ కాక్ కొనియాడారు. ధైర్యవంతుడు, తిరుగులేని పైలట్ అని ఆయన మాజీ సహచరుడొకరు ప్రశంసించారు.