breaking news
Unilateral
-
వాంగ్‌చుక్ నిర్బంధం అక్రమం
న్యూఢిల్లీ: ఉద్యమకారుడు సోనమ్ వాంగ్చుక్ను జాతీయ భద్రతా చట్టం(ఎన్ఎస్ఏ)కింద నిర్బంధించడాన్ని సవాల్ చేస్తూ ఆయన భార్య గీతాంజలి అంగ్మో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన భర్తను నిర్బంధించడం రాజ్యాంగ వ్యతిరేకం, ఏకపక్షం, చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. వాంగ్చుక్ను వెంటనే విడుదల చేసేలా అధికారులను ఆదేశించాలని కోరారు. లద్దాఖ్‌కు రాష్ట్ర హోదా డిమాండ్‌తో ఆయన దీక్షకు పూనుకోవడం, కేంద్ర పాలిత ప్రాంతంలో నిరసనలు హింసాత్మక రూపం దాల్చి నలుగురు చనిపోగా 90 మంది వరకు గాయపడటం తెల్సిందే. ఈ పరిణామాల నేపథ్యంలో అధికారులు ఆయన్ను సెపె్టంబర్ 26న అదుపులోకి తీసుకుని, రాజస్తాన్‌లోని జోథ్‌పూర్ జైలుకు తరలించారు. అంగ్మో తరఫున సీనియర్ లాయర్ వివేక్ తన్ఖా హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. వెంటనే విచారణ చేపట్టి, వాంగ్చుక్ను సుప్రీంకోర్టులో హాజరు పరచాలంటూ లద్దాఖ్ యంత్రాంగాన్ని ఆదేశించాలన్నారు. ఆయన్ను నేరుగా, ఫోన్ ద్వారా కలిసి మాట్లాడేందుకు తక్షణమే అవకాశం కల్పించాలన్నారు. కేంద్ర హోం శాఖ, లద్దాఖ్ యంత్రాంగం, లేహ్ డిప్యూటీ కమిషనర్, జోథ్‌పూర్ జైలు సూపరిటెండెంట్లను ఇందులో ప్రతివాదులుగా చేరారు. ‘అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన ఆవిష్కర్త, పర్యావరణవేత్త, సామాజిక సంస్కర్త అయిన వాంగ్‌చుక్, లద్దాఖ్‌లో పర్యావరణ, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం గాంధేయ విధానంలో, శాంతియుతంగా సాగే ఆందోళనలను మాత్రమే సమర్థించారు’అని అందులో పేర్కొన్నారు. దీర్ఘకాలం పాటు నిరాహార దీక్ష సాగించిన వాంగ్‌చుక్ తిరిగి కోలుకుంటున్న సమయంలో పోలీసులు అరెస్ట్ చేయడం, రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమేనన్నారు. అత్యవసరమైన వస్తువులు, మందులు తీసుకోనివ్వకుండా కుటుంబసభ్యులతో మాట్లాడనీయకుండా హడావుడిగా ఆయన్ను జోథ్‌పూర్ సెంట్రల్ జైలుకు తరలించారని అందులో ఆరోపించారు. ఇప్పటి వరకు ఆ నిర్బంధానికి గతల కారణాలను కుటుంబసభ్యులకు అధికారులు వెల్లడించలేదని పిటిషన్లో తెలిపారు. తనను దాదాపుగా గృహ నిర్బంధంలో ఉంచారని అంగ్మో తెలిపారు. వాంగ్‌చుక్ స్థాపించిన హిమాలయన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్, లద్దాఖ్ (హెచ్ఐఏఎల్) విద్యార్థులను, సిబ్బందిని అధికారులు విచారణ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారని తెలిపారు. వాంగ్చుక్కు విదేశీ సంస్థలతో సంబంధాలను అంటగడుతూ దు్రష్పచారం సాగిస్తున్నారన్నారు. నిర్బంధానికి సంబంధించిన ఉత్తర్వులను బయటపెట్టాలని, అరెస్ట్‌కు కారణాలను తెలిపే అన్ని రికార్డులను బహిర్గతం చేయాలని కోరారు. వాంగ్చుక్కు వెంటనే డాక్టర్‌తో వైద్య పరీక్షలు చేయించి, ఆరోగ్య నివేదికలను బయటపెట్టాలన్నారు. -
ఏకపక్షంగా జిల్లాల పునర్విభజన
గార్ల, బయ్యారం మండలాలను మహబూబాబాద్‌లో కలపొద్దు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పాల్వంచ: జిల్లాల పునర్విభజనలో సీఎం కేసీఆర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, అన్ని పార్టీల అభిప్రాయాలు తెలుసుకోకుండానే జిల్లాల పేర్లను కూడా ప్రకటించారని, సరైన నైసర్గిక స్వరూపాలు లేకుండానే విభజించారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. ఆయన గురువారం ఇక్కడ సీపీఐ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లాలోని గార్ల, బయ్యారం మండలాలను ప్రకటిత మహబూబాబాద్ జిల్లాలో కలపడం సరికాదన్నారు. కొన్ని నియోజకవర్గాలను మూడు ముక్కలు చేశారని అన్నారు. మోడీ ప్రభుత్వం ఒకవైపు ‘మేక్ ఇన్ ఇండియా’ అని నినదిస్తూనే, మరోవైపు రక్షణ, రైల్వే, ప్రభుత్వ రంగ పరిశ్రమల్లోకి విదేశీ పెట్టుబడులను ప్రొత్సíß స్తోందని.. మున్ముందు వీటిని ప్రైవేటీకరించేందుకు కుట్రలు సాగిస్తోందని విమర్శించారు. ఇప్పటివరకు ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు రూ.10లక్షల కోట్లు రాయితీగా ఇచ్చిందన్నారు. అధికారంలోకి వస్తే కార్మికులను ఆదుకుంటామని చెప్పిన బీజేపీ పెద్దలు.. గద్దెనెక్కాక అదే కార్మిక హక్కులను తుంగలో తొక్కుతున్నారని ధ్వజమెత్తారు. అందుకే, మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా సెప్టెంబర్ 2న దేశవ్యాప్త సమ్మెకు 10 జాతీయ కార్మిక సంఘాలు ఉమ్మడిగా పిలుపునిచ్చాయన్నారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. ప్రజాసమస్యలపై స్పందిస్తున్న ప్రతిపక్షాలను జైళ్లల్లో పెడతామని కేసీఆర్ బెదిరింపులకు దిగుతున్నారని అన్నారు. డబ్బు దండుకునేందుకే దుమ్మగూడెం రాజీవ్ సాగర్ ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.2,500 కోట్ల నుంచి రూ.8000 కోట్లకు కేసీఆర్ ప్రభుత్వం పెంచిందని విమర్శించారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి భాగం హేమంతరావు, సహాయ కార్యదర్శి సాబీర్‌పాషా, కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాధం, బరిగెల సాయిలు, మండే వీరహన్మంతరావు, పూర్ణచందర్రావు, ఆదాం, దుర్గాఅశోక్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.


