breaking news
Special Control Room
-
‘కరోనా’ కోసం కంట్రోల్ రూం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. కేరళలో ఒకరికి వైరస్ సోకడం, రాష్ట్రంలోనూ కరోనా అనుమానిత కేసులు నమోదు కావడంతో ప్రజల్లో భయాందోళన పెరిగింది. దీంతో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. కేంద్రం ఆదేశాల మేరకు కరోనాను ఎదుర్కొనేందుకు రాష్ట్రస్థాయిలో ఏర్పాట్లు చేసింది. కరోనా వైరస్ రాష్ట్ర పర్యవేక్షణాధికారి, ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు అంశాలు వెల్లడించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. లక్షణాలుంటే సంప్రదించండి.. కరోనా అనుమానిత లక్షణాలున్నవారు మమ్మల్ని నేరుగా సంప్రదించవచ్చు. దీని కోసం రాష్ట్రస్థాయిలో కంట్రోల్ రూం (040– 24651119) ఏర్పాటు చేశాం. చైనా నుంచి వచ్చిన వారు ముక్కు కారటం, జ్వరం, దగ్గు తదితర లక్షణాలుంటే ఈ నంబర్లో సంప్రదించాలి. సరోజినీ ఆస్పత్రిలో ఏర్పాట్లు.. చైనాలో చదివే తెలంగాణ విద్యార్థులు ఇక్కడకు వచ్చే పరిస్థితి ఉంటే, వారిలో అనుమానిత కేసులుంటే తక్షణమే ఐసోలేషన్ వార్డుల్లో ఉంచడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. గాంధీ, ఫీవర్, ఛాతీ ఆస్పత్రుల్లోని 100 పడకలతో పాటు సరోజినీ కంటి ఆస్పత్రిలో 100 నుంచి 150 పడ కలను శుక్రవారం నుంచి అందుబాటులోకి తెస్తున్నాం. గాంధీలో నిర్ధారణ పరీక్షలు కరోనా తీవ్రత దృష్ట్యా రెండు, మూడు రోజుల్లోనే గాంధీ ఆస్పత్రిలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్రం కూడా కరోనా నిర్ధారణ కిట్లను రాష్ట్రానికి పంపనుంది. అవి శుక్రవారం సాయంత్రాని కల్లా గాంధీ ఆస్పత్రికి రానున్నాయి. గాంధీలో ఉన్న మైక్రోబయాలజీ ల్యాబ్‌లో ‘కరోనా’ టెస్టులు చేపిస్తాం. 14 రోజులు పరిశీలనలో.. కరోనా అనుమానిత లక్షణా లున్న వారిని 14 రోజులపాటు ఐసోలేషన్ వార్డులో ఉంచాలి. ఇప్పటివరకు 11 మంది కరోనా అనుమానిత లక్షణాలున్న వారు రాష్ట్రంలో నమోదయ్యారు. వారిలో ఇద్దరికి ఎలాంటి లక్షణాలు లేవని తేలింది. ఏడుగురి రక్త నమూనాల పరీక్షల వివరాలు రావాలి. కొత్తగా ఇద్దరు చేరారు. స్వైన్‌ఫ్లూ, ఎబోలా, నిఫా వైరస్‌లతో పోలిస్తే కరోనా వైరస్‌లో మరణాల రేటు తక్కువని తేలింది. కాబట్టి ఆందోళన అవసరంలేదు. వారిని ఇళ్లలోనే ఉంచండి.. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఆదేశాలు వస్తున్నాయి. గురు వారం కూడా కేంద్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. జనవరి 15 తర్వాత చైనా నుంచి వచ్చిన వారందరినీ ఇళ్లలోనే 14 రోజుల పాటు ఉంచాలని కేంద్రం ఆదేశించింది. వివిధ రాష్ట్రాల ప్రభుత్వ సీఎస్‌లు, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శులు, ఇతర అధికారులతో కేంద్ర కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా సుదీర్ఘ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా అంశాన్ని చాలా సీరియస్‌గా తీసుకోవాలని, కేంద్రం ఇచ్చే మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలని గౌబా సూచించారు. జనవరి 15 తర్వాత తెలంగాణకు వచ్చిన వారి వివరాలను సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ నుంచి సేకరిస్తున్నాం. వీడియో కాన్ఫరెన్స్‌లో మన రాష్ట్రం నుంచి సీఎస్ సోమేశ్ కుమార్ కూడా పాల్గొన్నారు. వారిని పరిశీలనలో ఉంచండి: ఈటల దేశంలో మొదటి కరోనా కేసు కేరళలో నమోదైన నేపథ్యంలో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖను ఆ శాఖ మంత్రి ఈటల రాజేందర్ అప్రమత్తం చేశారు. చైనా నుంచి రాష్ట్రంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరినీ పరిశీలనలో ఉంచాలని, ఇంటి దగ్గర ఉన్నా పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. ఐసోలేషన్‌గా చికిత్స అందించేందుకు పూర్తిస్థాయిలో సన్నద్ధమై ఉండాలని అన్నారు. ఈ మేరకు మంత్రి గురువారం ఒక ప్రకటన జారీ చేశారు. -
సిద్దిపేట రక్షణ కోట!
‘ఓ ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది’ అనే తరహాలో మంత్రి వర్యులకు వచ్చిన ఓ ఆలోచన చోరాగ్రేసరుల ఆట కట్టించనుంది. అంతకంతకు పోలీసులకు సవాలుగా నిలుస్తూ సామాన్యుల జేబుల పాలిట కత్తెర్లగా మారుతున్న దొంగలకు సీసీ కెమెరాలు చెక్ పెట్టనున్నాయి. ఆ వివరాలేంటో చూద్దామా! చోరీలకు ఇక చెక్ * హరీష్‌రావు పకడ్బందీ ప్లాన్ * 120 సీసీ కెమెరాలతో నిఘా * కీలక ప్రాంతాల ఎంపిక * ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటుకు రంగం సిద్ధం సిద్దిపేట టౌన్:సిద్దిపేట పాతబస్టాండ్ ప్రాంతం.. బుధవారం.. ఉదయం.. రాజు అనే యువకుడు తనబైక్ పార్క్ చేశాడు.. గంటసేపు జిమ్‌లోకి వెళ్లి వచ్చాడు..సీన్ కట్ చేస్తే బైక్ గాయబ్ (మాయం). ఇలాంటి చోరీలు సిద్దిపేటలో ఎన్నెన్నో. సిద్దిపేట రైతు బజార్లో సగటున వారానికి మూడు రోజులు సెల్ఫోన్లు, పర్సులు అపహరణకు గురవుతున్నాయి. పాపభీతి లేకుండా దేవాలయాల్లో సైతం దొంగతనాలు జరిగిపోతున్నాయి. ఇక బస్టాండ్, సుభాష్‌రోడ్ తదితర రద్దీ ప్రాంతాల్లో కూడా గుట్టు చప్పుడు కాకుండా సామాన్యులు తమ పర్సులను పోగొట్టుకుంటున్నారు. ముఖ్యంగా సిద్దిపేటలో జరిగే వివిధ ఉత్సవాల్లో సందర్భంగా వేల మంది పోటెత్తుతున్న క్రమంలో కూడా గుర్తు తెలి యని వ్యక్తులు తమ చోరకళను ప్రదర్శిస్తున్నా రు. ఇలాంటి ఘటనలు ఎన్నెన్నో జరుగుతున్న అన్ని పోలీస్ స్టేషన్లకు వెళ్లడం లేదు. మిగి లిన వారి వేదన వ్యధగానే మిగిలిపోతోంది. పరిమితమైన పోలీస్ బలగాలు వీటిని సంపూర్ణంగా అరికట్టలేకపోతున్నాయి. దీంతో బాధితులు లబోదిబో మంటున్నారు. వీటన్నింటికి చెక్ పెట్టడానికే సీసీ కెమెరాల ఏర్పాటు. మెదక్ జిల్లాలో సిద్దిపేట పెద్ద పట్టణం. సుమారు లక్ష మంది ప్రజలిక్కడ నివసిస్తుంటారు. సుమారు 60 గ్రామాలు, పట్టణాల నుంచి ప్రతి రోజు వివిధ పనులపై విభిన్న వర్గాల ప్రజలు 40 వేల మంది ఇక్కడికి వస్తుంటారు. సిద్దిపేట రోజు రోజుకు పెరిగిపోతుంది. చోరీలు కూడా పెరిగిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో సిద్దిపేటలోని పాతబస్టాండ్, కొత్తబస్టాండ్, అంబేద్కర్ చౌరస్తా, సుభాష్‌రోడ్, మెయిన్‌రోడ్, లాల్‌కమాన్, గాంధీ చౌక్, మెదక్, హైదరాబాద్, కరీంనగర్ రోడ్, కూరగాయల మార్కెట్, రైతు బజార్, వ్యవసాయ మార్కెట్, ప్రధాన దేవాలయాలు, మసీదులు, చర్చ్‌లు, ఏరియా ఆస్పత్రి, మాతాశిశు సంక్షేమ కేంద్రం, హైరిస్క్ ఆస్పత్రి మొదలగు కీలక ప్రాంతాలను మంత్రి హరీశ్‌రావు వివిధ శాఖల అధికారులతో కలిసి ఎంపిక చేశారు. ఈ ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధమైంది. 120 సీసీ కెమెరాలను ప్రత్యేక కంట్రోల్ రూంకు అనుసంధానిస్తారు. నిరంతరంగా పని చేసే కంట్రోల్ రూంలో ఉద్యోగి ఎప్పటికప్పుడు నిఘాను పరిశీలిస్తారు. ముఖ్యంగా ప్రత్యేక ఉత్సవాలు జరిగే సందర్భాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలతో నిఘాను ముమ్మరం చేస్తారు. తద్వారా అనుమానాస్పద కదలికలు కనిపిస్తే వెంటనే అదనపు బలగాలను అక్కడికి పంపిస్తారు. దీంతో పాటు రాత్రిళ్లలో నిఘా కొనసాగిస్తారు. ఒక వేళ ఎక్కడైన చోరీ చేసి ఆగంతకులు పారిపోయినా కూడా వారిని ఎక్కడో ఒక చోట గుర్తిస్తారు. తద్వారా చోరీలను అరికట్టడానికి అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. దీంతో పాటు కిడ్నాప్‌లు, నేరాల్ని కూడా సీసీ కెమెరాలతో రికార్డు చేసి నేరస్తులను పట్టుకోవడానికి, సంఘటనలు పునరావృతం కాకుండా చూడడానికి అవకాశం ఉంటుంది. నగరం తరహాలో సిద్దిపేటలో నిఘా నగరాలలో జరుగుతున్న చోరీలను నియంత్రించడానికి సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. అక్కడి తరహా నిఘాను సిద్దిపేటలో కూడా ఏర్పాటు చేయబోతున్నాం. రాత్రిళ్లలో కూడా దృశ్యాలను బంధించే ఆధునిక సీసీ కెమెరాలు త్వరలో పని చేయబోతున్నాయి. ఇందుకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. త్వరలో కార్యరూపం దాలుస్తుంది. - హరీశ్‌రావు, రాష్ట్ర మంత్రి