breaking news
SP Viswajith
-
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల క్రాస్ రోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓవ్యక్తి దుర్మరణం చెందాడు. నేరెళ్లకు చెందిన భూమయ్య(55) ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఇసుక లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో భూమయ్య తల నేలకు తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఈ సంఘటనతో జిల్లెల్ల క్రాస్ రోడ్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. రెండు లారీలకు నిప్పు పెట్టి మరో లారీపై దాడిచేశారు. అడ్డుకోబోయిన పోలీసులపై తిరగబడ్డారు. ఇసుక లారీలను పోలీసులు ఎక్కడికక్కడే నిలిపివేసి భారీగా మోహరించారు. సంఘటనా స్థలానికి ఎస్పీ విశ్వజిత్ చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. -
సినీ ఫక్కీలో దోపిడీలు బట్టబయలు
సినిమా స్టయిల్లో దొంగతనాలు, దోపిడీలకు పాల్పడుతున్న ఓ ముఠాను నల్లగొండ పోలీసులు పట్టుకున్నారు. ఎస్పీ విశ్వజీత్ దుగ్గల్తెలిపిన వివరాలివీ...రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఆరుగురు సభ్యుల దొంగల ముఠా డీసీఎం వ్యానుతో విజయవా- హైదరాబాద్ రహదారిపై అనుమానం రాకుండా తిరుగుతుంటుంది. సరుకులతో వెళ్తున్న వాహనాలను వెంటాడుతుంది. వీలు దొరకగానే తమ డీసీఎం నుంచి ఆ వాహనంలోకి కొందరు చేరుకుంటారు. అందులోని సరుకులు, ఇతర విలువైన వస్తువులను తమ డీసీఎంలోకి మార్చుకుని, ఉడాయించటం ఈ గ్యాంగ్ స్టయిల్. దీనిపై బాధితుల ఫిర్యాదు అందుకున్న సూర్యాపేట పోలీసులు రంగంలోకి దిగి బుధవారం వారిని గుర్తించి, పట్టుకునేందుకు యత్నించగా నలుగురు పారిపోయారు. వారి డీసీఎంను రూ.21లక్షల నగదుతోపాటు రూ.10 లక్షల విలువైన బూస్ట్ డబ్బాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ విశ్వజీత్ దుగ్గల్ విలేకరులకు తెలిపారు.