breaking news
sampurnamma
-
చెట్టును ఢీకొట్టిన కారు.. ఇద్దరి మృతి
శ్రీకాళహస్తి : వేగంగా వెళ్తున్న కారు, లారీని ఓవర్టేక్ చేసే క్రమంలో అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం తొండమనాడు క్రాస్ వద్ద గురువారం చోటు చేసుకుంది. నెల్లూరుకు చెందిన శ్రీరాములు కుటుంబ సభ్యులతో కలిసి తిరుచానూరులో జరుగుతున్న తమ బంధువుల శుభకార్యానికి హజరై తిరిగివస్తున్నారు. ఈ క్రమంలో కారు తొండమనాడు క్రాస్ వద్దకు రాగానే లారీని ఓవర్ టేక్ చేసే క్రమంలో చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో పద్మజ, సంపూర్ణ మృతి చెందగా.. శ్రీరాములుకు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. -
తల్లికి చికిత్స కోసం వెళ్తూ..
రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృత్యువాత మృతులంతా ఒకే కుటుంబసభ్యులు వత్సవాయి మండలం కన్నెవీడులో విషాదం చౌటుప్పల్ (నల్లగొండ)/వత్సవాయి : అనారోగ్యంతో బాధపడుతున్న తల్లికి చికిత్స చేయించేందుకు తీసుకెళుతున్న వారిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళిచింది. ఈ ప్రమాదంలో తల్లి, కుమారుడుతోపాటు సాయంగా వెళుతున్న సోదరి కూడా కన్నుమూశారు. విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ దుర్ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి... వత్సవాయి మండలం కన్నెవీడు గ్రామానికి చెందిన కర్నాటి నారాయణ, సంపూర్ణమ్మ దంపతుల కుమారుడు వెంకటేశ్వరరావు హైదరాబాద్‌లోని ఉప్పల్ మున్సిపాలిటీలో టౌన్‌ప్లానింగ్ సూపర్వైజర్గా పనిచేస్తున్నారు. అక్కడే కొత్తపేటలోని డాక్టర్స్‌కాలనీలో నివాసం ఉంటున్నారు. నాలుగు నెలల క్రితం వెంకటేశ్వరరావు తండ్రి నారాయణ మృతిచెందారు. అప్పటి నుంచి తల్లి సంపూర్ణమ్మ ఇబ్రహీం పట్నంలో కుమార్తె వాసిరెడ్డి రాధ వద్ద ఉంటున్నారు. సంపూర్ణమ్మ(75) కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమెకు చికిత్స చేయించేందుకు హైదరాబాద్ తీసుకెళ్లడానికి వెంకటేశ్వరరావు నాలుగు రోజుల కిందట ఇక్కడికి వచ్చారు. బుధవారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో తల్లి సంపూర్ణ, అక్క వాసిరెడ్డి రాధ(54)తో కలిసి తన కారులో హైదరాబాద్ బయలుదేరారు. ఉదయం ఐదు గంటల సమయంలో నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం తుఫ్రాన్‌పేట గ్రామశివారులోని మైలారం క్రాస్‌రోడ్డు వద్ద గుర్తుతెలియని వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టాడు. దీంతో కారు ముందుభాగంలో కూర్చున్న వాసిరెడ్డి రాధ అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన వెంకటేశ్వరరావు(40), సంపూర్ణలను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో కన్నుమూశారు. వెంకటేశ్వరరావుకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కారు ఢీకొట్టిన వాహనం ఓ ప్రైవేటు ట్రావెల్స్‌కు చెందిన బస్సుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో కన్నెవీడులో విషాదఛాయలు అలముకున్నాయి.