breaking news
Sadavarti almshouse
-
‘కొమ్మాలపాటి’కి కావటి సవాల్
► సదావర్తి భూముల్లో అంగుళం కూడా తాకనివ్వం ► ఈనెల 26న చెన్నైలో నిజనిర్ధారణ కమిటీ పర్యటన పట్నంబజారు (గుంటూరు) : అమరావతిలోని అమరేశ్వరునికి సంబంధించిన సదావర్తి సత్రం భూముల్లో అంగుళం కూడా దక్కనివ్వబోమని వైఎస్సార్ సీపీ పెదకూరపాడు నియోజకవర్గ సమన్వయకర్త కావటి మనోహర్‌నాయుడు హెచ్చరించారు. నీతి నిజాయితీలతో స్థలాన్ని కొనుగోలు చేశామని చెబుతున్న టీడీపీ నేతలు బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. ఈ నెల 25న వైఎస్సార్ సీపీ నిజ నిర్ధారణ కమిటీ చెన్నైకి బయలుదేరి వెళ్ళి 26న స్థలాన్ని పరిశీలిస్తుందని చెప్పారు. పార్టీ రాష్ట్ర నాయకులు ధర్మాన ప్రసాద్‌రావు నేతృత్వంలో కమిటీ పర్యటిస్తుందని వివరించారు. అరండల్‌పేటలోని జిల్లా పార్టీ కార్యాలయంలో గురువారం పెదకూరపాడు నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కావటి మాట్లాడుతూ ఆలయం, సత్రం అభివృద్ధి పేరుతో కోట్లాది రూపాయలు విలువ చేసే భూములను కేవలం లక్షల్లో దోచుకునేందుకు కుట్రలు పన్నారని మండిపడ్డారు. చెన్నైలో పర్యటించి అక్కడ మార్కెట్, రిజిస్ట్రేషన్ విలువ, స్థానిక పరిస్థితులను పూర్తిస్థాయిలో చేస్తామని చెప్పారు. వాస్తవాలను ప్రజలకు తెలియజేసేందుకు పాటుపడుతున్నామన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి భూములను దోచుకోవటానికి కొమ్మాలపాటి పథ రచనలు చేశారని చెప్పారు. అవసరమైతే న్యాయ పోరాటానికి కూడా వెనుకాడబోమన్నారు. కార్యకర్తలపై దాడులు చేయించినంత మాత్రాన భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కార్యకర్తలకు అండగా పార్టీ ఉంటుందని, ఎటువంటి ఇబ్బంది వచ్చినా.. రాష్ట్ర, జిల్లా నాయకత్వం అండగా నిలుస్తుందని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ పార్టీ బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు కోవూరి సునీల్‌కుమార్, పెదకూరపాడు నియోజకవర్గ నేతలు కోట హరిబాబు, శ్రీకాంత్, సందెపోగు సత్యం, సయ్యద్ అబ్దుల్ రహీమ్, మీరయ్య, మేకల హనుమంతరావు, మగిశెట్టి కోటేశ్వరరావు లక్ష్మీనారాయణ, ఎంపీపీ వెంకటేశ్వరరెడ్డి, ప్రసాద్‌రెడ్డి, సాయిరెడ్డి, పాపారావు తదితరులు పాల్గొన్నారు. -
‘సదావర్తి’ సంచలనం
► సదావర్తి సత్రం భూదందాపై సర్వత్రా విమర్శలు ► వేలం నిర్వహణపై సత్రం చైర్మన్ అసంతృప్తి ► మండిపడుతున్న రాజకీయ పార్టీలు, ధార్మిక సంఘాలు సదావర్తి సత్రం భూ దందాపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ పార్టీలు, ప్రజా, ధార్మిక , బ్రాహ్మణ సంఘాలు నిరసన తెలుపుతున్నాయి. అధికారాన్ని అడ్డుపెట్టుకుని కొందరు వ్యక్తులు ఏకంగా దేవస్థానం, సత్రాల భూములకే ఎసరు పెట్టడంపై మండి పడుతున్నారు. రూ.కోట్లు ఖరీదు చేసే భూమిని అతి తక్కువ ధరకే కొల్లగొట్టేశారు. టీడీపీ నేతలు బరితెగించి సత్రం ఆస్తులను దోచుకోవడంపై ధ్వజమెత్తుతున్నారు. సాక్షి, విజయవాడ : అమరావతి సదావర్తి సత్రంలో ‘వెయ్యి కోట్ల లూటీ.. శీర్షికతో శనివారం ‘సాక్షి’ మెయిన్ మొదటి పేజీలో ప్రచురితమైన కథనం సంచలనం సృష్టిస్తోంది. దీనిపై తీవ్ర స్పందనలు వెల్లువెత్తాయి. పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్, కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ పక్కా స్కెచ్‌తో సాగిన అడ్డగోలు భూలూటీకి అధికార పార్టీ మంత్రులు సహకారం అందిచటంతో రూ.కోట్లు ఖరీదు చేసే భూమిని రూ.లక్షలకే దక్కించుకున్నారు. దీనిపై ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో సహా అన్ని రాజకీయ పార్టీలు మండిపడ్డాయి. మరోవైపు ‘సాక్షి’లో కథనం ప్రచురితమవడంతో జిల్లాలో ఇంటిలిజెన్స్ అధికారులు రంగంలో దిగి అసలు సత్రం వ్యవహారంపై విచారణ సాగించారు. రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు వారసుడు, సదావర్తి సత్రం చైర్మన్ రాజా వాసిరెడ్డి సుధాస్వరూప్ వేలం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంకోవైపు సాక్షి కథనం నంబూరులో కలకలం సృష్టించింది. నంబూరు గ్రామానికి చెందిన సంజీవరెడ్డి భూములను కొనుగోలు చేయడంతో వ్యవహారం కలకలం రేపింది. భూముల కొనుగోలుపై సర్వత్రా చర్చ నంబూరు గ్రామానికి చెందిన సంజీవరెడ్డి మంగళగిరి నూతక్కిలో స్థిరపడ్డారు. ట్రాక్టర్ వ్యాపారం చేసే సంజీవరెడ్డి రూ.22 కోట్లు పెట్టి సదావర్తి సత్రం భూములు కొనుగోలు చేయడం వెనుక మతలబుపై సర్వత్ర చర్చ సాగుతోంది. తెలుగుదేశం నేతల అనుచరుడుగా ఉన్న సంజీవరెడ్డి బినామీయేనని, తెరవెనుక కాపు కార్పొరేషన్ చైర్మన్‌తో పాటు మరికొందరు ప్రజాప్రతినిధులు, మంత్రులు ఉన్నట్లు సమాచారం. దీంతో ఇంటిలిజెన్స్ వర్గాలు సమగ్రంగా విచారణ నిర్వహిస్తున్నాయి. ఇంకోవైపు అమరావతి దేవస్థానంలో తీవ్ర అలజడి రేగింది. దేవస్థాన అధికారులు గతంలో నిర్వహించిన వేలం ప్రక్రియకు సంబంధించి వీడియోతో సహా అన్ని ఆధారాలు సిద్ధం చేసుకుంటున్నారు. దేవుడి స్థలాల జోలికొస్తే పతనం తప్పదు భక్తి భావం ఉందని పదే పదే చెప్పుకొంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే భూముల వేలంపై సీబీఐ విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలి. దేవాదాయ శాఖ భూములను అమరేశ్వరస్వామి, ఆలయం పరిధిలోనే ఉండేలా భూములను స్వాధీనం చేసి గుడికి అప్పగించాలి. దేవుడి స్థలాల జోలికి వస్తే వారి పతనం తప్పదు. హిందూ సంస్థలు న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నాయి. వేలం నిర్వహించినప్పుడు తమిళనాడులో డబ్బులు ఉన్న నేతలు వాపారస్తులు లేరా? కేవలం టీడీపీ నేతలు మాత్రమే వేలంలో పాల్గొనేలా అధికారులు వారికి వత్తాసు పలికారు. - దర్శనపు శ్రీనివాస్, హిందూ ధర్మ, రక్షా సమితి జిల్లా అధ్యక్షుడు వేలం దారుణం సదావర్తి సత్రం భూముల అక్రమ వేలం దారుణం. ధార్మిక కార్యక్రమాల కోసం, హిందు ధర్మ పరిరక్షణ కోసం దాతలు మంచి ఉద్దేశంతో ఇచ్చిన భూముల్ని ఇలా అమ్ముకోవడం దారుణం. రూ.కోట్లు విలువ చేసే భూముల్ని రూ.లక్షలకు ఎలా వియ్రిస్తారు. దీనిపై న్యాయ విచారణ జరపాలి. - దేవాలయాల పరిరక్షణ సమితి అధ్యక్షుడు స్వామి కమలానంద భారతీ స్వామి