breaking news
rishiteswari dead case
-
'రాత్రి 8 తర్వాత క్లాసులు వద్దు'
గుంటూరు: ర్యాంగింగ్ కారణంగా ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకోవడంతో మేలుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా సమన్వయ కమిటీ ఏర్పాటు చేసింది. ఆర్డీవో భాస్కరనాయుడు అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ కమిటీలో పోలీసు, రెవెన్యూ, యూనివర్సిటీ అధికారులు సభ్యులుగా ఉన్నారు. శుక్రవారం సమావేశమైన ఈ కమిటీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కమిటీ నిర్ణయాలు * రాత్రి 8 తర్వాత యూనివర్సిటీలో ఎటువంటి క్లాసులు నిర్వహించకూడదు * క్యాంపస్ లో హైసెక్యురిటీ ఏర్పాటు చేయాలి * కుల సంఘాలు, రాజకీయ పార్టీల వారికి వర్సిటీలో అడుగుపెట్టనీయరాదు * వర్సిటీలో పోలీస్ ఔట్ పోస్ట్ నిర్వహించాలి * ర్యాగింగ్ కమిటీలు ఏర్పాటు చేసి, అందులో విద్యార్థుల తల్లిదండ్రులకు చోటు కల్పించాలి -
'రిషితేశ్వరి' నిందితులకు రిమాండ్ పొడిగింపు
గుంటూరు: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో ముగ్గురు నిందితులు హనీషా, జయచరణ్, శ్రీనివాస్ ల రిమాండ్ ను కోర్టు మరో 14 రోజుల పాటుకోర్టు పొడిగించింది. వారికి విధించిన రిమాండ్ శుక్రవారంతో ముగియడంతో వారిని పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. ఈ కేసులో A1గా సీనియర్ విద్యార్థిని హనీషా, A2గా జయచరణ్, A3గా శ్రీనివాస్ పేర్లను పోలీసులు నమోదు చేశారు. మరోవైపు రిషితేశ్వరి మృతిపై నియమించిన బాలసుబ్రహ్మణ్యం కమిటీ విచారణ ముగిసింది.