breaking news
relocate
-
ఆ దేశాన్ని వీడుతున్న ప్రజలు!.. కారణం ఏంటంటే?
యుద్ధాలు, అంతర్యుద్ధాలు కొన్ని దేశాల ప్రజలను శరణార్థులుగా మారుస్తుంటే.. వాతావరణంలో మార్పులు ఒక దేశ మనుగడకు ముప్పుగా పరిణమించాయి. అ దేశం పేరు తువాలు. హవాయి, ఆ్రస్టేలియా మధ్యలో పసిఫిక్ మహాసముద్రంలో తొమ్మిది చిన్న పగడపు దీవులతో కూడిన అతి చిన్న దేశం. ఇక్కడి జనాభాలో మూడింట ఒక వంతుకు పైగా ఆ్రస్టేలియాకు వెళ్లిపోవాలనుకుంటున్నారు. ప్రజలు దేశాన్ని వీడటానికి కారణమేంటి? వాతావరణం ఆ దేశానికి ముప్పుగా ఎలా మారింది? ఇప్పుడు వార్తల్లో ఎందుకు నిలిచింది చూద్దాం. తువాలు.. ప్రపంచంలోనే అత్యల్ప జనాభా కలిగిన దేశాలలో ఒకటి. ఇక్కడి జనాభా 10,000 మంది కంటే తక్కువ. అంటే మన దేశంలో చిన్న పట్టణంతో సమానం. 1978లో బ్రిటిష్ పాలకుల నుంచి నుంచి స్వాతంత్య్రం పొందింది. సహజమైన సౌందర్యానికి నెలవు. స్కూబా డైవింగ్‌కు ఎంతో ప్రసిద్ధి పొందింది. ఇక ఈ దేశంలో అతి పెద్ద దీవి.. పగడపు దీవి అయిన ఫనాఫుటి. ఇది దేశ రాజధాని కూడా.దీనికి కొన్ని ప్రదేశాల్లో కేవలం 65 అడుగుల వెడల్పు ఉన్న రన్‌వే లాంటి భూమి ఉంది. వాతావరణంలో మార్పులు ఈ దేశానికి ముప్పుగా పరిణమించాయి. దీంతో ఇక్కడి ప్రజలు ఆ్రస్టేలియాకు వలసపోతారు. వీరికి నివాసం కల్పించడం కోసం మానవతా దృక్పథంతో ఆ్రస్టేలియా ల్యాండ్‌మార్క్ వీసా పథకాన్ని రూపొందించింది. ఈ నెల 16న దరఖాస్తుల విండోను ప్రారంభించింది.ఇప్పటివరకు 4,000 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. వీరి నుంచి జనవరి 2026 వరకు 280 మందిని ఎంపిక చేయనుంది. ఈ వీసాలను గెలుచుకున్న వారు.. ఆస్ట్రేలియాలో శాశ్వత నివాసం పొందుతారు. విద్య, ప్రజారోగ్యంతోపాటు పనిచేసే హక్కు కూడా వారికి లభిస్తుంది. 2050 నాటికి తువాలులో సగానికి పైగా భూమి మునిగిపోతుందని, ఇక 2100 నాటికి 90శాతం దేశం సముద్రంలో కలిసిపోతుందని తువాలు ప్రధాన మంత్రి ఫెలేటి టియో తెలిపారు. అయితే భవిష్యత్తులో ఎవరూ అక్కడ నివసించలేకపోయినా, తువాలుకు గుర్తింపు ఇస్తామని ఆస్ట్రేలి యా హామీ ఇచ్చింది – -
టిబెట్‌పై చైనా కొత్త కుట్రలు.. లక్ష మందిని..!
బీజింగ్: టిబెట్‌ను బల ప్రయోగంతో ఆక్రమించుకున్న డ్రాగన్ దేశం చైనా ఇప్పుడు మరో కుతంత్రానికి తెరతీస్తోంది. 2030 నాటికి లక్ష మందికిపైగా టిబెట్ ప్రజలను వారి సంప్రదాయ జీవన విధానం నుంచి దూరం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంటే టిబెట్ పౌరులను వారి సొంత గ్రామాల నుంచి దూరంగా తరలిస్తారు. ఇందుకోసం చైనా చెబుతున్న సాకు పర్యావరణ పరిరక్షణ. సముద్ర మట్టానికి 4,800 మీటర్లకుపైగా ఎత్తున్న ప్రాంతాల్లో నివసించే వారిని ఇతర ప్రాంతాలకు తరలించనున్నట్లు చెబుతోంది. జనావాసాల కారణంగా పర్యావరణం దెబ్బతింటోందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు నమ్మబలుకుతోంది. జనాన్ని తరలించడానికి చైనా ప్రభుత్వం తన సైనికులకు శిక్షణ ఇస్తున్నట్లు సమాచారం. వివాదాస్పద సరిహద్దుల్లో కొత్త గ్రామాలను చైనా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అవి తమ భూభాగాలే అని వాదిస్తోంది. వివాదాస్పద హిమాలయ ప్రాంతాల్లో 624 గ్రామాలను నిర్మించాలని చైనా లక్ష్యంగా పెట్టుకున్నట్లు హాంకాంగ్‌కు చెందిన ఓ పత్రిక ఇటీవల వెల్లడించింది. చైనా కుట్రల కారణంగా కనీసం 2 లక్షల మంది టిబెట్ ప్రజలు సహజ ఆవాసాల నుంచి దూరమయ్యే ప్రమాదం పొంచి ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదీ చదవండి: ముదిరిన రాజకీయ సంక్షోభం.. పార్లమెంటులోకి ప్రవేశించిన ఆందోళనకారులు -
బ్రాంచ్‌ల మూతకు ఎస్బీఐ ప్లాన్
ముంబై : దేశీయ ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా తన బ్రాంచులను తగ్గించుకునే ప్రణాళికను రచిస్తోంది. తన గ్రూపు నుంచి 30 శాతం బ్రాంచులను పునర్ నిర్మించుకోవడం లేదా మూసివేసే ప్రతిపాదనను పరిశీలిస్తోంది. గ్లోబల్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ మెకిన్సే సూచన మేరకు ఎస్బీఐ ఈ మేరకు అడుగులు వేయనున్నట్టు సమాచారం. బ్రాంచ్ అప్టిమైజేషన్కు మెకిన్సేను సలహాదారుగా నియమించామని ఎస్బీఐ ఎండీ రాజ్నీష్ కుమార్ స్పష్టంచేశారు. అయితే బ్రాంచుల సైజు తగ్గించడంపై మాత్రం వ్యాఖ్యానించడానికి ఆయన నిరాకరించారు. బ్రాంచ్‌ల, ఏటీఎమ్‌ల అప్టిమైజేషన్ కోసం, వినియోగదారులకు మెరుగైన అనుభవాలు అందించడానికి మెకిన్సేతో కలిశామని కుమార్ వెల్లడించారు. యాక్సేంచర్ ఫైనాన్సియల్ సర్వీసులతో కూడా తాము కలిసి పనిచేస్తున్నట్టు తెలిపారు. బ్రాంచుల అప్టిమైజేషన్ చర్యలో భాగంగా, ఎస్బీఐ ఇటీవలే తన 400 బ్రాంచులను మూసివేయడం లేదా పునర్ నిర్మించుకోవడం చేసింది. దీంతో బ్యాంకు తన వ్యయాలను తగ్గించుకుంది. కొత్త బ్రాంచులను కలుపుకోవడాన్ని యేటికేటికి తగ్గిస్తూ వస్తున్న ఎస్బీఐ..గతేడాది కేవలం 451 బ్రాంచులనే జోడించుకుంది. ప్రస్తుతం ఈ బ్యాంకు 16,784 బ్రాంచులు కలిగిఉంది. అయితే ఈ ఆర్థిక సంవత్సరంతో ముగిసే లోపు ఐదు అనుబంధ బ్యాంకుల, భారతీయ మహిళా బ్యాంకు విలీన ప్రక్రియతో మరో 6,978 బ్రాంచులు తనలో కలుపుకోనుంది అనుబంధ బ్యాంకుల విలీన ప్రక్రియతో వ్యయాలు కచ్చితంగా తగ్గుతాయని కుమార్ తెలిపారు. లేకపోతే విలీనాన్ని తామెందుకు ప్రతిపాదిస్తామన్నారు. బ్రాంచుల కొత్త ఫార్మాట్ కోసం బ్యాంకు యోచిస్తోందని వెల్లడించారు. 133 ఇన్ టచ్ బ్రాంచులను సెల్ఫ్ సర్వీసు మోడ్ లో వివిధ రకాల ఆన్లైన్ సేవలు అందించడానికి ఎస్బీఐ ప్రారంభించింది. ఒక్కసారి విలీన ప్రక్రియ పూర్తయితే కంపెనీ రూ.37లక్షల కోట్ల అసెట్ బేస్‌తో, 24వేల బ్రాంచులు, 58వేల ఏటీఎమ్లుగా బ్యాంకు ఆవిర్భవించనుంది. .